Viral Video | పెళ్లికి వెళ్లి గిన్నెలు క‌డిగిన ఎంబీఏ విద్యార్థి..

Viral Video | పెళ్లిళ్లు అన‌గానే రుచిక‌ర‌మైన మాంసాహారం, శాఖాహారం గుర్తుకు వ‌స్తుంది. ఇక పిలుపు అందిందంటే చాలు ఫంక్ష‌న్ హాల్లో వాలి పోతుంటారు భోజ‌న ప్రియులు. కొంద‌రైతే త‌మ‌కు ఆహ్వానం లేకున్నా వెళ్లిపోతూనే ఉంటారు. చాటుమాటున భోజ‌నం లాగించేసి వ‌స్తుంటారు. ఇలాంటి వారిని చూసి పిల‌వ‌ని పేరంటానికి వ‌చ్చార‌ని పెళ్లి వారు ఈస‌డించుకుంటారు. అలా పిల‌వ‌ని పేరంటానికి వెళ్లిన ఓ ఎంబీఏ విద్యార్థికి తీవ్ర అవ‌మానం ఎదురైంది. క‌ఠిన శిక్ష విధించారు పెళ్లి వారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని […]

  • Publish Date - December 2, 2022 / 07:47 AM IST

Viral Video | పెళ్లిళ్లు అన‌గానే రుచిక‌ర‌మైన మాంసాహారం, శాఖాహారం గుర్తుకు వ‌స్తుంది. ఇక పిలుపు అందిందంటే చాలు ఫంక్ష‌న్ హాల్లో వాలి పోతుంటారు భోజ‌న ప్రియులు. కొంద‌రైతే త‌మ‌కు ఆహ్వానం లేకున్నా వెళ్లిపోతూనే ఉంటారు. చాటుమాటున భోజ‌నం లాగించేసి వ‌స్తుంటారు. ఇలాంటి వారిని చూసి పిల‌వ‌ని పేరంటానికి వ‌చ్చార‌ని పెళ్లి వారు ఈస‌డించుకుంటారు. అలా పిల‌వ‌ని పేరంటానికి వెళ్లిన ఓ ఎంబీఏ విద్యార్థికి తీవ్ర అవ‌మానం ఎదురైంది. క‌ఠిన శిక్ష విధించారు పెళ్లి వారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో ఇటీవ‌లే ఓ వివాహం జ‌రిగింది. అయితే ఆ వివాహ వేడుక‌కు చాలా మంది అతిథులు వ‌చ్చేశారు. ఓ ఎంబీఏ స్టూడెంట్ కూడా ఆ పెళ్లి జ‌రిగే ఫంక్ష‌న్ హాల్‌కు చేరుకున్నాడు. విందు కార్య‌క్ర‌మం ప్రారంభం కాగానే ఆ వ‌రుస‌లో వెళ్లి నిల్చున్నాడు. అత‌ను కొత్త వ్య‌క్తి అని పెళ్లింటి వారు నిర్ధారించారు. అనుమానంతో వారు అత‌న్ని ఆరా తీయ‌గా, త‌న‌కు ఈ పెళ్లికి ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పాడు విద్యార్థి. దీంతో అత‌నికి క‌ఠిన శిక్ష విధించారు. అతిథులు భోజ‌నం చేసిన ప్లేట్ల‌ను క‌డిగించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఎంబీఏ స్టూడెంట్‌కు జ‌రిగిన అవ‌మానం ప‌ట్ల ప‌లువురు నెటిజ‌న్లు ఆవేద‌న‌కు గుర‌య్యారు. ఇలాంటి అవ‌మానం ఎవ‌రికీ కూడా జ‌ర‌గ‌కూడ‌ద‌ని పేర్కొన్నారు.