MEDAK BJP| మెదక్ జిల్లా బీజేపీలో గ్రూపుల గోల.. అధ్యక్షుడిపై అధిష్టానానికి ఫిర్యాదు
MEDAK, BJP, NARSAPUR త్వరలో ప్రక్షాళన.. ‘బండి’ దృష్టికి సమస్యలు టికెట్ ఆశిస్తున్న వారిలో సమన్వయ లోపం మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఎవరికి వారే కార్యక్రమాలు జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌కు పదవీ గండం కొత్త అధ్యక్షునిగా రఘువీరా రెడ్డి? విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: (MEDAK BJP) మెదక్ జిల్లా బీజేపీ ఎవరికి వారే యమునా తీరే అన్నా చందంగా తయారైంది. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఇదే తంతు కొనసాగుతున్నదని పార్టీ వర్గాల్లో జోరుగా […]

MEDAK, BJP, NARSAPUR
- త్వరలో ప్రక్షాళన.. ‘బండి’ దృష్టికి సమస్యలు
- టికెట్ ఆశిస్తున్న వారిలో సమన్వయ లోపం
- మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఎవరికి వారే కార్యక్రమాలు
- జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌కు పదవీ గండం
- కొత్త అధ్యక్షునిగా రఘువీరా రెడ్డి?
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: (MEDAK BJP) మెదక్ జిల్లా బీజేపీ ఎవరికి వారే యమునా తీరే అన్నా చందంగా తయారైంది. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఇదే తంతు కొనసాగుతున్నదని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బీజేపి పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని ముఖ్యంగా తూప్రాన్‌కు చెందిన నాయకులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
పార్టీ టికెట్ ఆశిస్తున్న ఒక్కో అభ్యర్థితో డబ్బులు ఖర్చు పెట్టించి, మరో నాయకునికి మద్దతు ప్రకటిస్తూ సదరు అభ్యర్థులను పక్కన పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులను, కార్యకర్తలను, జిల్లా అధ్యక్షుడు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
రామయంపేట చెందిన మహిళ నాయకురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ రెండు ఉప ఎన్నికల్లో పని చేసినప్పటికి అమెకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదని, అశ్విని నేతృత్వంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు నాయకులు బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
దీంతో స్వయంగా బండి సంజయ్ జిల్లా పార్టీ అధ్యక్షునికి ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. జిల్లాలో అశ్వినికి ప్రాధాన్యత ఇవ్వాలని బండి సంజయ్ సూచించినా జిల్లా అధ్యక్షుడు పట్టించు కోలేదని తెలస్తోంది.
మెదక్ నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి స్వర్గీయ కరణం రాంచందర్ రావు కోడలు పరిమిత, కె,జనార్దన్ రెడ్డి, న్యాయవాదులు, సుభాష్ చందర్ గౌడ్, టి,రాజశేఖర్, నందా రెడ్డి, రాంచరణ్ యాదవ్, తదితరులను ఒక్క తాటిపై ఉంచి కార్యక్రమాలను నిర్వహించడంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ విఫలం చెందారని పార్టీ అధిష్టాన వర్గం భావిస్తున్నట్లు సమాచారం.
పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ సహితం మెదక్ నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అందుకే జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి తప్పించి నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన రఘువీరా రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను త్వరలో అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పార్టీ అధ్యక్షులే టికెట్ ఆశిస్తూ స్వంత ఏజెండా అమలు చేస్తున్నారని అధిష్టాన వర్గం భావిస్తుంది.. అందుకే పార్టీ జిల్లా అధ్యక్షుల మార్పులకు శ్రీకారం చుడుతుందనీ ప్రచారం సాగుతోంది.
యువ మోర్చ.. అధ్యక్షులుగా ఇద్దరు
ఇటీవలికాలం వరకు జిల్లా యువ మోర్చా అధ్యక్షునిగా రమాకాంత్, ఉదయ్, లు కొనసాగారు.అధ్యక్షుని గా రమాకాంత్, జిల్లా పార్టీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ప్రపోజల్ తోనే జిల్లా యువ మొర్చా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.కొద్దిరోజులకే రమాకాంత్ ను అధ్యక్షునిగా తప్పించి, ఉదయ్‌ని జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించారు.
రాష్ట్ర అధిష్టానం ఇటీవలి వరకు రమాకాంత్‌నే పార్టీ యువ మోర్చా అధ్యక్షుడిగా కొనసాగించారు. రమాకాంత్ జిల్లా అధ్యక్షుడిపై రాష్ట్ర అధిష్టాన వర్గంకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులు అయా మండలాల్లో అధ్యక్షులుగా కొనసాగిన వడ్ల జనార్దన్, తీగల శ్రీనివాస్ గౌడ్, యాదగిరిలను తప్పించి వారికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిసింది.
నర్సాపూర్‌లో సహితం..
నర్సాపూర్ నియోజకవర్గంలో సహితం ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి బీఅర్‌ఎస్ పార్టీ నుంచి వచ్చిన నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, సింగాయ పల్లి గోపి, రఘువీరా రెడ్డిలు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. వీరందరినీ సమన్వయం చేయడంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నర్సాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చిలుముల విఠల్ రెడ్డి మనుమడు రఘువీరా రెడ్డికి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ బీజీలకు ఇవ్వాలనుకుంటే మాత్రం పార్టీ మురళి యాదవ్‌కు ఇస్తారని ప్రచారం జరుగుతుంది.