Medak: బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

విధాత, మెదక్ బ్యూరో: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొక మహిళ తీవ్ర గాయాలు పాలైన ఘటన. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని కిస్టాపూర్ మూలమలుపు వద్ద చోటు చేసుకుంది. కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. అతిర్ఖాన్ (21), అతని స్నేహితురాలు అంజలి (20) ద్విచక్ర వాహనంపై మెదక్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టడంతో బైక్ పై నుంచి కింద పడగా అతిర్ఖాన్ […]

  • Publish Date - April 2, 2023 / 02:04 PM IST

విధాత, మెదక్ బ్యూరో: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొక మహిళ తీవ్ర గాయాలు పాలైన ఘటన. మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని కిస్టాపూర్ మూలమలుపు వద్ద చోటు చేసుకుంది.

కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. అతిర్ఖాన్ (21), అతని స్నేహితురాలు అంజలి (20) ద్విచక్ర వాహనంపై మెదక్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టడంతో బైక్ పై నుంచి కింద పడగా అతిర్ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

అంజలికి తీవ్ర గాయాలు కావడంతో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుని తల్లి అషీబా ఫిర్యాదు మేరకు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.