Medak |
విధాత, మెదక్ బ్యూరో: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నిరంకుశ వైఖరికి నిరసనగా హవేలీ ఘణపూర్ మండల నాగ పూర్ సర్పంచ్ బీఆరెస్ పార్టీ నాయకుడు, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఒంటరి రాజేందర్ రెడ్డి బీఆరెస్ పార్టీకి రాజీనామా చేశారు.
తన గ్రామంలో సంక్షేమ పథకాలకు సంబంధించి తాను సమర్పించిన అర్హుల జాబితాను పక్కన పెట్టిన పద్మాదేవేందర్‌రెడ్డి తన అనుచరులు ఇచ్చిన జాబితాను తీసుకున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే ద్వారా గ్రామం అభివృద్ధి జరుగుతుందని భావించి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలసి పనిచేశానన్నారు.
ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి వర్గంలో కొనసాగిన నన్ను తన వర్గానికి పిలిపించుకున్న విషయం మరిచి, నా పనులు చేయకుండా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నిరాశ పరిచారని రాజేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని తనకు, తన గ్రామానికి ప్రాధాన్యత ఇవ్వాలని రాజేందర్ రెడ్డి కోరారు.