Medak | చట్టబద్దతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి: మహిళా కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డి

Medak రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిట సునీతా రెడ్డి ఎమ్మెల్యేలు పద్మా రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి విధాత, మెదక్ బ్యూరో: చట్టబద్దతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి ,మదన్ రెడ్డి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీతా రెడ్డి సభా ముఖంగా ప్రకటించారు. శుక్రవారం మెదక్(Medak) పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్స్ లో మెదక్ జిల్లా రెడ్ల ఆత్మీయ […]

  • Publish Date - April 28, 2023 / 01:34 AM IST

Medak

  • రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిట సునీతా రెడ్డి
  • ఎమ్మెల్యేలు పద్మా రెడ్డి, మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి

విధాత, మెదక్ బ్యూరో: చట్టబద్దతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి ,మదన్ రెడ్డి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీతా రెడ్డి సభా ముఖంగా ప్రకటించారు. శుక్రవారం మెదక్(Medak) పట్టణంలోని వెంకటేశ్వర గార్డెన్స్ లో మెదక్ జిల్లా రెడ్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.

ఈ సందర్బంగా రాజా బహదూర్ వెంకట్రామి రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశీ విద్యా నిధి పథకం పేద రెడ్ల పిల్లలకు అందేలా చర్యలు చేపడుతామన్నారు.ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలయ్యేలా కృషి చేస్తామన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో పేద విద్యార్ధుల కోసం రెడ్డి హాస్టల్ నిర్మాణం కోసం ప్రయత్నిస్తామన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసేలా కృషి చేస్తామన్నారు.పేద రెడ్లకు సబ్సిడీలు, సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. హైదరాబాద్ లో రాజా బహదూర్ వెంకట్రామి రెడ్డి భవనం కోసం ప్రభుత్వం అత్యంత ఖరీదైన స్థలం కేటాయించిందని, రూ 10 కోట్ల నిధులు సీఎం కేసీఆర్ కేటాయించారన్నారు.

మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ,ఫ్రొఫెసర్ బాణపురం మధుసూదరెడ్డిలు మాట్లాడుతూ పేద రెడ్ల అభ్యున్నతి కోసం తమవంతు కృషి చేస్తామన్నారు. రెడ్లకు రావాల్సిన హక్కులు సాధించుకోవాలంటే ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను,ఎమ్మెల్సీ ,మహిళ కమిషన్ చైర్మన్ ను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, నందా రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు తిరుపతిరెడ్డి, పీసీసీ నాయకులు ఆవుల రాజిరెడ్డి, సోమన్నగారి రవీందర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, ఎంపీపీలు యమునా జయరాం రెడ్డి, చందన ప్రశాంత్ రెడ్డి ,నారాయణ రెడ్డి, నర్సాపూర్ ఆత్మ చైర్మన్ వెంకట్ రెడ్డి , మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, రెడ్డి సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు ఏనుగు సంతోష్ రెడ్డి, మామిడి సుధాకర్ రెడ్డి, పిట్ట శ్రీనివాస్ రెడ్డి

సంజీవ రెడ్డి, రమేష్ రెడ్డి, చంద్ర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జిల్లా నేతలు రాజేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భాగారెడ్డి, అంజిరెడ్డి, ప్రభు రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సూర్యకాంత్ రెడ్డి, పబ్బతి ప్రభాకర్ రెడ్డి, అవుల గోపాల్ రెడ్డి, జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.