Medak |
విధాత,మెదక్ బ్యూరో: ఒకప్పుడు.. మెదక్ జిల్లాలో ఇద్దరు మైనారిటీలు.. ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహించారు. మాజీ మంత్రి జహీరాబాద్‌కు చెందిన స్వర్గీయ ఫరీదోద్దీన్‌తో పాటు సిద్దిపేటకు చెందిన ఫా రూఖ్ హుస్సేన్ ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహించారు.
ఫరీదోద్దిన్ మరణించడంతో.. ఫారుక్ హుస్సేన్‌ను ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ వచ్చిన సీఎం కేసీఆర్ ఈ సారి ఆయనకు మొండి చేయి చూపారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యనారాయణ అదనంతర కాలంలో టీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో సోమవారం నిర్వహించిన రాష్ట్ర క్యాబినెట్‌లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పేరును ప్రతిపాదించారు. దీంతో గవర్నర్ కోటాలో తనకే అవకాశం లభిస్తుందన్న ఫారూక్ ఆశలు గల్లంతయ్యాయి.
సంగారెడ్డి జిల్లా చెందిన మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డికి ఇటీవలే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. ఇప్పుడు మళ్లీ అదే నియోజకవర్గం నుంచి ఎరుకల (ఎస్టీ)కి చెందిన సత్యనారాయణకు ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారు