Medak | ఏడుపాయల వన దుర్గ భవాని మాతకు హైకోర్టు చీఫ్ జస్టిస్ దంపతుల పూజలు

Medak మెదక్ చర్చిలో..ప్రార్థనలు చేసిన న్యాయమూర్తులు… విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలో ఉన్న ఏడుపాయల వన దుర్గ భవాని మాతను శనివారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ దంపతులు,హైకోర్టు న్యాయమూర్తులు, సంతోష్ రెడ్డి, నవీన్ రావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈ.ఓ సారా శ్రీనివాస్, సిబ్బంది తో పాటు అర్చక బృందం పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]

  • Publish Date - June 17, 2023 / 01:18 AM IST

Medak

  • మెదక్ చర్చిలో..ప్రార్థనలు చేసిన న్యాయమూర్తులు…

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలో ఉన్న ఏడుపాయల వన దుర్గ భవాని మాతను శనివారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ దంపతులు,హైకోర్టు న్యాయమూర్తులు, సంతోష్ రెడ్డి, నవీన్ రావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈ.ఓ సారా శ్రీనివాస్, సిబ్బంది తో పాటు అర్చక బృందం పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ఈ.ఓ శ్రీనివాస్ వారికి శాలువతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేయడ తో పాటు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బి వి ప్రసాద్, మెదక్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, మెదక్ డి.ఎస్.పి సైదులు ఉమ్మడి మెదక్ జిల్లా జడ్జిలు పాల్గొన్నారు..

మెదక్ చర్చిలో ప్రార్థనలు..

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ క్యతడ్రల్ చర్చిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తులు సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చర్చి గురువులను చర్చికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం చర్చి కమిటీ సభ్యులు బాణీ తదితరులు జడ్జి లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

Latest News