Medical Colleges
విధాత : తెలుగు రాష్ట్రాలలో ఒకే రోజు 14 మెడికల్ కళాశాలలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిడం యాదృచ్చికంగా జరిగినా రాష్ట్ర విభజన పిదప రెండు రాష్ట్రాలలో పెరిగిన మెడికల్ కశాళాలల సంఖ్య వైద్య విద్యలో గొప్ప మైలురాయిగా మిగలనుంది. శుక్రవారం ఒక్క రోజునే తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమరం భీం అసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల మెడికల్ కళాశాలలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.
CM Sri KCR inaugurates 9 new medical colleges in Telangana
In a historic move, Telangana Chief Minister Sri KCR virtually inaugurated 9 new government medical colleges in 9 districts from Pragathi Bhavan today.
The districts include Kamareddy, Karimnagar, Khammam, Nirmal,… pic.twitter.com/d6vhHQUWHL
— BRS Party (@BRSparty) September 15, 2023
అటు ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్.జగన్మోహన్‌రెడ్డి విజయనగరం నుంచి ఒకేసారి విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు మెడికల్ కళాశాలలను ప్రారంభించారు. కేంద్రం కొత్తగా 157కళాశాలలు మంజూరు చేయడం కూడా దేశ వ్యాప్తంగా మెడికల్ విద్య విస్తరణకు గొప్ప బూస్టునిచ్చింది.