ఏడుపాయల జాతరను.. మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

ప్రభుత్వం తరపున అమ్మ వారికి పట్టు వస్త్రాలు అంద‌జేత‌ మీడియాతో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విధాత, మెదక్ బ్యూరో: మ‌హాశివ‌రాత్రిని పుర‌స్క‌రించుకొని నేటి నుంచి ఏడుపాయలలో ప్రారంభం కానున్న మ‌హా జాత‌ర‌ను మంత్రి హరీష్ రావు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రారంభిస్తారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ విష‌య‌మై క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అత్యంత వైభవోపేతంగా జరిగే మహాశివరాత్రి జాతరకు రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుండి […]

ఏడుపాయల జాతరను..  మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
  • ప్రభుత్వం తరపున అమ్మ వారికి పట్టు వస్త్రాలు అంద‌జేత‌
  • మీడియాతో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

విధాత, మెదక్ బ్యూరో: మ‌హాశివ‌రాత్రిని పుర‌స్క‌రించుకొని నేటి నుంచి ఏడుపాయలలో ప్రారంభం కానున్న మ‌హా జాత‌ర‌ను మంత్రి హరీష్ రావు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రారంభిస్తారని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ విష‌య‌మై క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.

అత్యంత వైభవోపేతంగా జరిగే మహాశివరాత్రి జాతరకు రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని, భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం రూ.2కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం హ‌ర్ష‌ణీయ‌మ‌ని అన్నారు. ఆ నిధుల‌తో భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం కోసం షాపింగ్ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టామని రాబోవు కాలంలో భక్తుల వసతి కోసం కమ్యూనిటీ హాల్‌ కూడా నిర్మించనున్న‌ట్టు తెలిపారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తుల కోసం సింగూర్ నుండి నీటిని విడుదల చేసిన‌ట్టు పేర్కొన్నారు.

మహాశివరాత్రి నాడు ఉపవాస దీక్షలు.. రెండో రోజు శకట భ్రమనోత్సవం.. మూడో రోజు రథోత్సవ కార్యక్రమంతో జాతర ముగుస్తుందని తెలిపారు. 2014 కంటే ముందు ఏడుపాయల సంవత్సర ఆదాయం కోటిన్నర ఉంటే ప్రస్తుతం ఏడుపాయల ఆదాయం ఎనిమిది కోట్లకు పెరిగింది అన్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని క్షేమంగా వెళ్లాల‌ని కోరారు.