అన్ని హామీలు నెరవేరుస్తాం: మంత్రి సీతక్క

మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్ వేశారు.

  • By: Somu    latest    Dec 09, 2023 11:29 AM IST
అన్ని హామీలు నెరవేరుస్తాం: మంత్రి సీతక్క

విధాత : మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్ వేశారు. ప్రజలు మాకు అధికారమిచ్చి రెండు రోజులే అయ్యిందని.. విమర్శలకు అప్పుడే మీకు ఎందుకంత తొందరంటూ విమర్శించారు. రెండు రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు.


బీఆరెస్ పాలనలో తడిసిన వడ్లు కొనకుండా రైతులను అరిగోస పెట్టిందన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులను తరుగు పేరుతో దోచుకుందన్నారు. మేం రైతులకు ఇస్తామన్న క్వింటాల్‌కు 500బోనస్ ఇస్తామని, రైతు భరోసా కింద 15వేల సహాయం అందిస్తామన్నారు. ఇందులో హరీశ్‌రావుకు అంత తొందర అవసరం లేదని, ఇన్నాళ్లుగా మీకున్న వందల ఎకరాల ఫామ్‌హౌజ్‌లకు రైతుబంధు పొందారని, మళ్లీ మీకే ఎక్కువ లబ్ధి వస్తుందని తొందరేందుకుని హరీశ్‌రావుకు మంత్రి సీతక్క చురకలేశారు.