Minister Seethakka | కాంగ్రెస్‌కు జనాదరణ ఓర్వలేకనే కవిత విమర్శలు
కాంగ్రెస్ పార్టీకి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకనే బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత సహా ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు

- మేడారం జాతర పనులు గడువులోగా పూర్తి చేయాలి
- మంత్రి సీతక్క
Minister Seethakka | విధాత : కాంగ్రెస్ పార్టీకి వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకనే బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత సహా ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఈ నెల 21నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె శనివారం అక్కడికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రూ.500కే మహిళలకు గ్యాస్ సిలిండర్ స్కీమ్‌భు త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని కవిత తప్పుబట్టడంపై మండిపడ్డారు.
దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆరెస్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఇంద్రవెల్లి సభను ప్రభుత్వ నిధులతో నిర్వహించలేదని సీతక్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిధులతోనే ఇంద్రవెల్లి సభను నిర్వహించామన్నారు. బీఆరెస్ మాదిరిగా పార్టీ కార్యక్రమాలకు ప్రజా ధనం దుర్వినియోగం చేయలేదని కౌంటర్ ఇచ్చారు. ప్రియాంక గాంధీ గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని, ప్రియాంక గాంధీ కాలి గోటికి కూడా కవిత సరిపోదని సీతక్క మాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆరెస్ నేతలు అక్కను వెళ్లగక్కుతున్నారని సీతక్క మండిపడ్డారు. అంతకుముందు మేడారం మహాజాతర పనులను పరిశీలించిన సీతక్క కొండాయి గ్రామంలోని గోవిందరాజులు, నాగులమ్మ , సారలమ్మలను దర్శించుకున్నారు. దొడ్ల వద్ద జంపన్నవాగుపై కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
గత సంవత్సరం వరదలకు గోవిందరాజులు, సారలమ్మ, నాగులమ్మ ఆలయ ప్రాంతాలు కొట్టుకుపోగా వాటి మరమ్మత్తులకు బడ్జెట్ రిలీజ్ చేశామన్నారు. జాతర పనుల బిల్లులు ఇవ్వడంలో గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందన్నారు. పాత బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు ప్రస్తుత జాతర పనులను ఆపితే ఊరుకునేది లేదన్నారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఫారెస్ట్ అనుమతులు లేకపోవడంతో కొన్ని రోడ్ల నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయన్నారు. మరో నాలుగు రోజుల్లో అన్ని రోడ్ల నిర్మాణాలు పూర్తవుతాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు.