MLC Sheri Subhash Reddy | నేను మెదక్ టికెట్ అడుగుతున్నా.. అంతిమ నిర్ణయం సీఎం కేసీఆర్‌దే: సుభాష్ రెడ్డి

ఈనెల 17 న మెదక్‌లో 70 కంపెనీలతో జాబ్ మేళా సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి MLC Sheri Subhash Reddy | విధాత, మెదక్ బ్యూరో: తాను మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆరెస్ టికెట్ ఆశిస్తున్నానని అంతిమ నిర్ణయం సీఎం కేసీఆర్‌దేనని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి (MLC Sheri Subhash Reddy) క్యాంపు కార్యాలయంలో […]

  • Publish Date - August 11, 2023 / 12:11 PM IST
  • ఈనెల 17 న మెదక్‌లో 70 కంపెనీలతో జాబ్ మేళా
  • సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

MLC Sheri Subhash Reddy | విధాత, మెదక్ బ్యూరో: తాను మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆరెస్ టికెట్ ఆశిస్తున్నానని అంతిమ నిర్ణయం సీఎం కేసీఆర్‌దేనని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి (MLC Sheri Subhash Reddy) క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను మెదక్ నియోజక వర్గంలో బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పోటీపై అంతిమ నిర్ణయం సీఎం కేసీఆర్ (CM KCR) తీసుకుంటారన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

మెదక్ నియోజకవర్గ నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 17న మెదక్ (Medak) లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి తెలిపారు. 4000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా ఈ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 70 కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ప్రకటించారు. మెదక్ సాయి బాలాజీ గార్డెన్లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

ఏడవ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీలతోపాటు ఐటిఐ ఇతర డిప్లమా కోర్సులు చదివిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి అణువుగా ఉండేలా క్యూ ఆర్ కోడ్ ఇస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫారం కూడా అందజేయవచ్చని సూచించారు. మెగా జాబ్ మేళా ఏర్పాటులో జిల్లా కలెక్టర్, ఎస్పీల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు.

నైపుణ్యం మేరకు పారదర్శకంగా వారి అర్హతల ఆధారంగా ఉద్యోగులకు ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో హవేలీ ఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, నాయకులు ప్రశాంత్ రెడ్డి, గంగా నరేందర్, పుట్టి అక్షయ్ కుమార్, సాన సత్యనారాయణ, గోపాలరావు, నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రంజా తదితరులు పాల్గొన్నారు.