Viral Video | మనషులు దొంగతనం చేయడం రోజు చూస్తునే ఉన్నాం. జంతువులు, సరీసృపాలు కూడా మనషుల బాట పట్టాయి. మొన్న ఓ పాము చెప్పును ఎత్తుకెళ్లిన ఘటన చూశాం. ఇప్పుడు దొంగతనం చేయడం కోతి వంతు అయింది. ఓ కోతి ఏకంగా 13 సీసీటీవీ కెమెరాలను దొంగిలించింది. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కన్యాకుమారిలో ఓ వ్యక్తి ప్లైవుడ్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. అయితే ప్లైవుడ్ కంపెనీ నుంచి వస్తువులను దొంగిలించకుండా ఉండేందుకు అక్కడ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సీసీటీవీ కెమెరాలను దొంగిలిస్తున్నారు. అలా ఏకంగా 13 సీసీటీవీ కెమెరాలను అపహరించారు.
సీసీ కెమెరాలను ఎవరు దొంగిలిస్తున్నారో యజమానికి అర్థం కాలేదు. అయితే చివరగా ఓ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఓ కోతి వాటిని దొంగిలిస్తున్నట్లు తేలింది. దీంతో యజమాని షాక్‌కు గురయ్యాడు. ఏకంగా 13 కెమెరాలను కోతి దొంగిలించిందని తెలుసుకొని విస్తుపోయాడు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.