Panchakarla | మంకీస్ మ్యారేజ్.. సుబ్బీస్ డెత్

Panchakarla పంచకర్ల దెబ్బకు టిడిపి సీనియర్‌కు టికెట్ ఫస్సాక్ ? విధాత‌: ఎంకిపెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదేకావచ్చు.. వైసిపి జిల్లా అధ్యక్షుడి రాజీనామా ఒక టిడిపి సీనియర్ నాయకుడి సీటుకు ఎసరొచ్చేలా ఉంది. మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు తన రాజకీయ భవితవ్యాన్ని ఇంకా ప్రకటించలేదు. కానీ అయన అడుగులు మాత్రం జనసేన వైపే ఉండొచ్చు అని అంటున్నారు. గతంలో అయన […]

  • Publish Date - July 15, 2023 / 08:10 AM IST

Panchakarla

  • పంచకర్ల దెబ్బకు టిడిపి సీనియర్‌కు టికెట్ ఫస్సాక్ ?

విధాత‌: ఎంకిపెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదేకావచ్చు.. వైసిపి జిల్లా అధ్యక్షుడి రాజీనామా ఒక టిడిపి సీనియర్ నాయకుడి సీటుకు ఎసరొచ్చేలా ఉంది. మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు తన రాజకీయ భవితవ్యాన్ని ఇంకా ప్రకటించలేదు. కానీ అయన అడుగులు మాత్రం జనసేన వైపే ఉండొచ్చు అని అంటున్నారు.

గతంలో అయన పెందుర్తి నుంచి 2009లో ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ 2014లో అయన టిడిపిలో చేరి యలమంచిలి ఉంచి గెలిచారు. ఐతే ఇప్పుడు టికెట్ దక్కడం కష్టం అయ్యే పరిస్థితి ఉండడంతో అయన వైఎస్సార్ కాంగ్రెస్ ను వీడారు. అయితే అయన ఇప్పుడు పెందుర్తి నుంచి జనసేన తరఫున పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు అయన ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను కలిసి హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది. సరే అయన పోటీ చేయడం సంగతి ఆలా ఉంచితే ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆదీప్ రాజు ఉన్నారు. ఆయన 2019లో సీనియర్ టిడిపి నాయకుడు నాలుగైదు సార్లు గెలిచిన బండారు సత్యనారాయణ మూర్తిని ఓడించారు.

ఇప్పుడు మళ్లీ బండారు పోటీకి రెడీ అవుతున్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని అయన చంద్రబాబుకు చెప్పినట్లు, ఆయన సైతం టికెట్ కోసం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బండారు ఇలా హామీ తీసుకున్నారు.

కానీ.. అక్కడ పంచకర్ల రమేష్ బాబు సైతం పవన్ దగ్గర హామీ తీసుకున్నారు. మరి టిడిపి జనసేన మధ్య పొత్తు ఉంటె పెందుర్తి సీట్ ఎవరికీ దక్కుతుంది.? టిడిపి పోటీ చేస్తుందా ? జనసేన పోటీ చేస్తుందా ? ఇప్పుడు ఈ టికెట్ కోసం పవన్.. చంద్రబాబు మధ్య పంచాయతీ అయ్యేలా ఉంది..

అక్క‌డ ఎవర్ని కాదన్నా ఇటు ఇబ్బంది అవుతుంది. కేవలం టికెట్ మీద హామీతోనే పంచకర్ల వైసిపి నుంచి బయటికి వచ్చారు. ఆ టికెట్ కానీ దక్కకుంటే అనవసరంగా పార్టీ మారి నష్టపోయినట్లు అవుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ పీటముడి ఎలా వీడుతుందో చూడాలి.