Chandrayaan-3 | చంద్ర‌యాన్ 3 తీసిన జాబిలి తొలి వీడియో.. విడుద‌ల చేసిన ఇస్రో

Chandrayaan-3 విధాత‌: ల‌క్ష్యం వైపు దూసుకుపోతున్న చంద్ర‌యాన్ 3ని ఆదివారం జాబిల్లి క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టామ‌ని ఇస్రో ఆదివారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. త‌ర్వాతి ప్ర‌క్రియ‌ను మంగ‌ళ‌వారం చేప‌ట్ట‌నుంది. తాజాగా ఉప‌గ్ర‌హం తీసిన చంద‌మామ తొలి వీడియోను ఇస్రో ట్విట‌ర్‌లో పంచుకుంది. ఉప‌గ్ర‌హాన్ని రార‌మ్మ‌ని ఆహ్వానిస్తున్న‌ట్లు వీడియో జాబిల్లి తెల్ల‌గా మెరిసిపోతోంది. The Moon, as viewed by #Chandrayaan3 spacecraft during Lunar Orbit Insertion (LOI) on August 5, 2023.#ISRO pic.twitter.com/xQtVyLTu0c — LVM3-M4/CHANDRAYAAN-3 […]

  • Publish Date - August 7, 2023 / 06:36 AM IST

Chandrayaan-3

విధాత‌: ల‌క్ష్యం వైపు దూసుకుపోతున్న చంద్ర‌యాన్ 3ని ఆదివారం జాబిల్లి క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టామ‌ని ఇస్రో ఆదివారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. త‌ర్వాతి ప్ర‌క్రియ‌ను మంగ‌ళ‌వారం చేప‌ట్ట‌నుంది. తాజాగా ఉప‌గ్ర‌హం తీసిన చంద‌మామ తొలి వీడియోను ఇస్రో ట్విట‌ర్‌లో పంచుకుంది. ఉప‌గ్ర‌హాన్ని రార‌మ్మ‌ని ఆహ్వానిస్తున్న‌ట్లు వీడియో జాబిల్లి తెల్ల‌గా మెరిసిపోతోంది.

అయితే నిర్ణీత ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే చంద్ర‌యాన్ 3 క‌క్ష్య‌ని మ‌రో మూడు సార్లు మార్చాల్సి ఉంటుంది. ఈ నెల 17వ తేదీలోపు ఈ ప్ర‌క్రియ పూర్తి కావాలి. జాబిల్లి ఉప‌రితలానికి 100 కి.మీ. ఎత్తుకు ఉప‌గ్ర‌హం చేరుకున్నాక‌.. రోవ‌ర్‌, ల్యాండ‌ర్ నుంచి విడిపోయి చంద్రుని ఉప‌రిత‌లం వైపు త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తాయి. మాడ్యుల్‌లో ఉండే స్పెక్ట్రో పోలారిమెట్రో ఆఫ్ హ‌బిటెబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్‌) ప‌రిక‌రం … చంద్రుని ఉప‌రిత‌లాన్ని నిశితంగా ప‌రిశోధిస్తుంది.

అయితే రోవ‌ర్ ల్యాండ‌ర్ .. చంద్రుని ఉప‌రిత‌లాన్ని తాక‌డానికి 15 నిమిషాలు ప‌డుతుంది. ఈ కాలాన్నే ఇస్రో శాస్త్రవేత్త‌లు టెర్ర‌ర్ ఆఫ్ 15 మినిట్స్ అని పిలుస్తారు. ఈ స‌మ‌యంలో ఉప‌గ్ర‌హంపై శాస్త్రవేత్త‌ల‌కు ఎటువంటి నియంత్ర‌ణ ఉండబోదు. ఆగ‌స్టు 23న ఈ ప్ర‌క్రియ జ‌ర‌గ‌నుంద‌ని భావిస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే చంద్రుని ద‌క్షిణ ధ్రువంపై విజ‌య‌వంతంగా దిగాల‌న్న భార‌త్ కోరిక నెర‌వేరిన‌ట్లే.