Moosi Project | మూసీ ప్రాజెక్టు నాలుగు గేట్ల ఎత్తివేత
Moosi Project జంట జలశయాల్లోకి వరద ఉదృతి గరిష్ట నీటి మట్టానికి చేరువలో హుస్సెన్ సాగర్ విధాత: జంటనగరాలతో పాటు మూసీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మూసీ నది వరద ఉధృతి పెరిగిన నేపధ్యంలో నల్లగొండ జిల్లా కేతేపల్లి మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 5వేల 466క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 5వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. మూసీ వరద ఉదృతి […]

Moosi Project
- జంట జలశయాల్లోకి వరద ఉదృతి
- గరిష్ట నీటి మట్టానికి చేరువలో హుస్సెన్ సాగర్
విధాత: జంటనగరాలతో పాటు మూసీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మూసీ నది వరద ఉధృతి పెరిగిన నేపధ్యంలో నల్లగొండ జిల్లా కేతేపల్లి మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.
ఇన్‌ఫ్లో 5వేల 466క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 5వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. మూసీ వరద ఉదృతి కారణంగా వలిగొండ సంగెం గ్రామల మధ్య , రుద్రవెల్లి పోచంపల్లి, బీబీనగర్‌ల మధ్య కాజ్‌వేల మీదుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అటు హైద్రాబాద్ హిమాయత్ సాగర్ ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తివేశారు. వికారాబాద్, తాండూర్, శంకరపల్లి, షాబాద్ ప్రాంతాల నుండి ప్రాజెక్టుకు వరద ఉదృతి కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టులోకి 1200క్యూసెక్కులు ఇనఫ్లో వస్తుండగా, 700క్యూసెక్కుల అవుట్ ఫ్లోను దిగువకు వదులుతున్నారు.
హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం1763.50అడుగులు కాగా ప్రస్తుతం 1761.20 అడుగులకు చేరింది. జంట జలాశయాల్లో భాగమైన ఉస్మాన్ సాగర్‌కు 1100క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, పూర్తి స్థాయి నీటి మట్టం 1790అడుగులకుగాను ప్రస్తుతం 1784.70అడుగులకు చేరింది.
హుస్సేన్ సాగర్‌కు సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఫుల్ ట్యాంకు లెవల్ 513.45మీటర్లు కాగా ప్రస్తుతం 514.75మీటర్లు దాటింది. ఆయా ప్రాజెక్టుల కింద లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.