Morocco Earthquake | మొరాకోలో మృత్యుఘోష.. భూకంప మృతులు 2 వేలకు పైగా..
Morocco Earthquake | విధాత, హైదరాబాద్: మొరాకోలో భారీ భూకంపం విలయాన్ని సృష్టించింది. అర్థరాత్రి భూకంపం ధాటికి ఇండ్లలోని ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. భూమి కంపించడంతో వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. ఈ విపత్తులో దాదాపు 2000 మందికి పైగా ప్రాణాలు విడిచినట్లు, 2059 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం అర్ధరాత్రి 11.11 గంటల సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లు, సంభవించిన 19 నిమిషాల తరువాత 4.8 గా […]

Morocco Earthquake |
విధాత, హైదరాబాద్: మొరాకోలో భారీ భూకంపం విలయాన్ని సృష్టించింది. అర్థరాత్రి భూకంపం ధాటికి ఇండ్లలోని ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. భూమి కంపించడంతో వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. ఈ విపత్తులో దాదాపు 2000 మందికి పైగా ప్రాణాలు విడిచినట్లు, 2059 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
శనివారం అర్ధరాత్రి 11.11 గంటల సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లు, సంభవించిన 19 నిమిషాల తరువాత 4.8 గా ఉన్నట్లు అమెరికా విపత్తుల శాఖ వెల్లడించింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కష్టాల్లో ఉన్న మొరాకోను ఆదుకునేందుకు పొరుగు దేశాలు ముందుకు వచ్చాయి. ఇండియా, తుర్కియే, రష్యా, ఉక్రెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు మొరాకో ప్రజలకు సాయం చేస్తామని వెల్లడించాయి.
Morocco earthquake. pic.twitter.com/w8MNtyxh9a
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!—