కోరికలు తీర్చుకునేందుకు.. 4 నెలల బిడ్డను బలి ఇచ్చిన తల్లి
Uttar Pradesh | ఓ తల్లి తన కోరికలు తీర్చుకునేందుకు 4 నెలల పసికందును ఓ విగ్రహం ఎదుట బలి ఇచ్చింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ ఏరియాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గోసాయిగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ధనౌదిహ్ గ్రామంలో మంజు దేవి(35) అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమెకు ఓ తాంత్రికుడితో ఏర్పడిన పరిచయం, వివాహేతర సంబంధానికి దారి తీసింది. కోరికలను తీర్చుకోవాలంటే.. పసికందును బలివ్వాలని ఆమెకు తాంత్రికుడు చెప్పాడు. దీంతో […]

Uttar Pradesh | ఓ తల్లి తన కోరికలు తీర్చుకునేందుకు 4 నెలల పసికందును ఓ విగ్రహం ఎదుట బలి ఇచ్చింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ ఏరియాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గోసాయిగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ధనౌదిహ్ గ్రామంలో మంజు దేవి(35) అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమెకు ఓ తాంత్రికుడితో ఏర్పడిన పరిచయం, వివాహేతర సంబంధానికి దారి తీసింది. కోరికలను తీర్చుకోవాలంటే.. పసికందును బలివ్వాలని ఆమెకు తాంత్రికుడు చెప్పాడు. దీంతో ఆమె తన నెలల బిడ్డను ఓ విగ్రహం ముందు బలి ఇచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. శిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను చంపేందుకు ఉపయోగించిన గడ్డపారను సీజ్ చేశారు. తాంత్రికుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.