గడీలు బద్దలుకొట్టి జనం వస్తున్నారు: మోత్కుపల్లి నర్సింహులు

తెలంగాణలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ఆవిష్కృతమైందని, ప్రజలు గడీలు బద్దలుకొట్టి ప్రజా భవన్ కు తరలివస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు

  • By: Somu    latest    Dec 08, 2023 12:39 PM IST
గడీలు బద్దలుకొట్టి జనం వస్తున్నారు: మోత్కుపల్లి నర్సింహులు

విధాత: తెలంగాణలో కాంగ్రెస్ సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ఆవిష్కృతమైందని, ప్రజలు గడీలు బద్దలుకొట్టి ప్రజా భవన్ కు తరలివస్తున్నారని కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, నూతన సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో మార్పు కనిపిస్తున్నదని చెప్పారు.


ప్రజా దర్బార్ బాగుందని, వేలాది మంది ప్రజలు వారి సమస్యలు చెప్పుకోడానికి తరలివస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చెయ్యని పని రేవంత్ చేస్తున్నారని అభినందించారు. నేను కూడా ప్రజా భవన్ లో ప్రజాదర్బార్ చూడ్డానికి వచ్చానని, ఇక్కడి సామాన్యుల సందోహం చూసి చాలా సంతోషంగా వుందని చెప్పారు. ప్రజలు గడీలు బద్దలు కొట్టి తరలివస్తుండడంతోనే మార్పు మొదలవుతోందని అన్నారు