Mulugu | పోలీసు వాహనం బోల్తా.. ఎస్సై, డ్రైవర్ మృతి

Mulugu మృతుల్లో ఎస్సై, వాహన డ్రైవర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పోలీస్ వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టిన సంఘటనలో ఎస్సైతో సహా డ్రైవర్ మృతి చెందిన సంఘటన ములుగు (Mulugu) జిల్లా ఏటూరునాగారం సమీపంలో మంగళవారం జరిగింది. ఈ సంఘటనలో ఏటూర్ నాగారం ఎస్సై ఇందిరయ్య తో పాటు జీపు డ్రైవర్ మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సెకండ్ ఎస్ఐ ఇందిరయ్య, […]

  • Publish Date - May 2, 2023 / 09:55 AM IST

Mulugu

  • మృతుల్లో ఎస్సై, వాహన డ్రైవర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పోలీస్ వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టిన సంఘటనలో ఎస్సైతో సహా డ్రైవర్ మృతి చెందిన సంఘటన ములుగు (Mulugu) జిల్లా ఏటూరునాగారం సమీపంలో మంగళవారం జరిగింది. ఈ సంఘటనలో ఏటూర్ నాగారం ఎస్సై ఇందిరయ్య తో పాటు జీపు డ్రైవర్ మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సెకండ్ ఎస్ఐ ఇందిరయ్య, డ్రైవర్ కలిసి ప్రయాణిస్తుండగా ఏటూరునాగారం మండలం కమలాపురం రహదారి మధ్యలోని జీడీ వాగు వద్ద వాహనం బోల్తా కొట్టి అదుపుతప్పింది. ఈ ప్ర‌మాదంలో ఏటూరునాగారం సెకండ్ ఎస్సై ఇందిరయ్య, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.