Facial Massage | రూ. 17,500తో ఫేసియ‌ల్ మ‌సాజ్.. కాలిపోయిన యువ‌తి ముఖం

Facial Massage | ప్ర‌తి అమ్మాయి అందంగా ఉండాల‌ని కోరుకుంటోంది. అందులో త‌ప్పేం లేదు. కానీ అందంగా త‌యార‌య్యేందుకు, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేందుకు చాలా మంది అమ్మాయిలు బ్యూటీ పార్ల‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. బ్యూటీ పార్ల‌ర్ల‌లో ర‌క‌ర‌కాల ఫేసియ‌ల్స్ ఉప‌యోగించి, ఆ స‌మ‌యానికి అందంగా, ఆక‌ర్షణీయంగా ఉండేలా మేక‌ప్ వేస్తారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ఆ ఫేసియ‌ల్స్ బెడిసికొట్టే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ఆ ర‌సాయ‌నాలు వారి చ‌ర్మానికి ప‌డ‌క‌పోతే ఆరోగ్య స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అయితే ఓ […]

Facial Massage | రూ. 17,500తో ఫేసియ‌ల్ మ‌సాజ్.. కాలిపోయిన యువ‌తి ముఖం

Facial Massage | ప్ర‌తి అమ్మాయి అందంగా ఉండాల‌ని కోరుకుంటోంది. అందులో త‌ప్పేం లేదు. కానీ అందంగా త‌యార‌య్యేందుకు, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేందుకు చాలా మంది అమ్మాయిలు బ్యూటీ పార్ల‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. బ్యూటీ పార్ల‌ర్ల‌లో ర‌క‌ర‌కాల ఫేసియ‌ల్స్ ఉప‌యోగించి, ఆ స‌మ‌యానికి అందంగా, ఆక‌ర్షణీయంగా ఉండేలా మేక‌ప్ వేస్తారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ఆ ఫేసియ‌ల్స్ బెడిసికొట్టే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ఆ ర‌సాయ‌నాలు వారి చ‌ర్మానికి ప‌డ‌క‌పోతే ఆరోగ్య స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది.

అయితే ఓ యువ‌తి త‌న ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాల‌నే ఉద్దేశంతో ఓ బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లింది. అక్క‌డ ఫేసియ‌ల్ మ‌సాజ్ చేయించుకున్న కొద్ది గంట‌ల‌కే ఆమె ముఖం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ముంబై అంధేరి కామ‌ధేను షాపింగ్ సెంట‌ర్‌లోని గ్లో ల‌క్స్ సెలూన్‌కు ఓ అమ్మాయి ఈ నెల 17వ తేదీన వెళ్లింది. త‌న ముఖంపై ఉన్న రంధ్రాలు పూడ్చేలా ఫేసియ‌ల్ మ‌సాజ్ చేయాల‌ని సెలూన్ నిర్వాహ‌కుల‌ను కోరింది. దీంతో వారు హైడ్రాఫేసియ‌ల్ ట్రీట్‌మెంట్ చేస్తే.. ముఖంపై రంధ్రాలు పూర్తిగా మాయ‌మ‌వుతాయ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో యువ‌తి రూ. 17500 చెల్లించి హైడ్రాఫేసియ‌ల్ మసాజ్ చేయించుకుంది.

ఇక ఫేసియ‌ల్ మ‌సాజ్ చేయించుకుని యువ‌తి ఇంటికి వ‌చ్చింది. కొద్ది గంట‌ల త‌ర్వాత ముఖం కాలుతున్న‌ట్లు అనిపించింది. కాసేప‌టికే చ‌ర్మంపై పొక్కులు ఏర్ప‌డి కాలిపోయాయి. దీంతో బాధిత యువ‌తి డెర్మ‌ట‌లాజిస్ట్ ను సంప్ర‌దించింది. చ‌ర్మం పూర్తిగా కాలిపోయింద‌ని, దీనికి కార‌ణం హైడ్రాఫేసియ‌లే అని డెర్మ‌ట‌లాజిస్ట్ నిర్ధారించారు. దీంతో బాధితురాలు స్థానిక ఎంఎన్ఎస్ కార్పొరేట‌ర్ ప్ర‌శాంత్ రాణే స‌హాయంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

హైడ్రాఫేసియ‌ల్ ట్రీట్‌మెంట్ ద్వారా చ‌ర్మంపై ఉండే రంధ్రాల‌ను పూర్తిగా పూడ్చివేయొచ్చు. అదే విధంగా చ‌ర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. అయితే ఈ ట్రీట్‌మెంట్ చేసేందుకు అనుభ‌వ‌జ్ఞులైన మెడిక‌ల్ ప్రొఫెష‌న్ల‌కు మాత్ర‌మే లైసెన్స్‌ను జారీ చేస్తారు. అలాంటి వారిచే ఈ ట్రీట్‌మెంట్ చేయించుకుంటే ఎలాంటి ప్ర‌మాదం ఉండ‌ద‌ని నిపుణులు సూచిస్తున్నారు.