వ‌రుణ్ తేజ్ పెళ్లిలో ఆ త‌ప్పు చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్న నాగ‌బాబు..!

  • By: sn    latest    Oct 16, 2023 7:52 AM IST
వ‌రుణ్ తేజ్ పెళ్లిలో ఆ త‌ప్పు చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్న నాగ‌బాబు..!

మెగా ఇంట మ‌రి కొద్ది రోజుల‌లో పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. కొన్నాళ్ల‌పాటు ప్రేమ‌లో ఉన్న వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి ఈ ఏడాది జూన్ 9న నిశ్చితార్థం జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ వేడుక‌కి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. ఇక రీసెంట్‌గా ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ కూడా జ‌రిగాయి.

వాటికి సంబంధించిన ఫొటోల‌ని మెగాస్టార్ చిరంజీవి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ సెలబ్రిటీ జంట ఎప్పుడు పెళ్లి పీట‌లు ఎక్కుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో వరుణ్, లావణ్య వివాహం జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.

విలాసవంతమైన వివాహ వేడుకకి ముందు అక్టోబర్ చివరి వారంలో మెహందీ, సంగీత్, ఇతర వేడుకలతో సహా వివాహానికి ముందు కొన్ని ఉత్స‌వాలు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. దాదాపు 50-60 మంది వ్యక్తులతో కూడిన అతిథులతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు వివాహానికి హాజ‌రు కానున్న‌ట్టు స‌మాచారం.

వరుణ్, లావణ్య కుటుంబాలు ఈ ఈవెంట్ కోసం డెకర్, దుస్తులను సెలెక్ట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ సారి వ‌రుణ్ తేజ్ పెళ్లి విష‌యంలో నాగ‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నట్టు తెలుస్తుంది. . గతంలో మెగా డాటర్ నిహారిక పెళ్లి విషయంలో జరిగిన తప్పు వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో జ‌ర‌గ‌కూడ‌దు అని స్ట్రిక్ట్‌గా చెప్పాడ‌ట‌.

నిహారిక‌- చైతన్య పెళ్లిలో ఫొటో షూట్స్ వ‌ల‌న పంతులు పెట్టిన ముహుర్తానికి తాళి క‌ట్ట‌లేదు. దాని వ‌ల్ల‌నే నిహారిక‌- జొన్న‌ల‌గ‌డ్డ విడిపోయారంటూ అనేక వార్త‌లు వ‌చ్చాయి. ఇలాంటి త‌ప్పు వ‌రుణ్ తేజ్ పెళ్లిలో జ‌ర‌గ‌కూడ‌ద‌ని భావించిన నాగ‌బాబు పెట్టిన ముహూర్తానికే వరుణ్ లావణ్య మెడలో మూడు ముళ్ళు వేసేలా పక్క ప్లాన్ తో ముందుకెళ్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీలో చాలా మంది పెళ్లైన కొద్ది రోజుల‌కి విడాకులు తీసుకున్నారు. అలాంటిది త‌న కుమారుడి జీవితంలో జ‌ర‌గ‌కూడ‌ద‌ని నాగ‌బాబు చాలా ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నాడ‌ట‌