Naga Babu మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో త్వరలో పెళ్లి సందడి నెలకొననుంది. మెగా ఫ్యామిలీలో పెళ్లి కావాల్సిన హీరోలు క్యూలో ఉండగా, ఒకరి తర్వాత ఒకరికి పెళ్లి చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకోనుండగా, ఇప్పటివరకు ఆ పెళ్లి తేది ప్రకటించలేదు. ఇటీవల తన పెళ్లి నవంబర్‌లో ఉండొచ్చని చూచాయగా చెప్పారు. పెళ్లి చాలా సింపుల్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగే అవకాశం ఉందని కూడా అన్నారు. పెళ్లికి […]
Naga Babu
మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో త్వరలో పెళ్లి సందడి నెలకొననుంది. మెగా ఫ్యామిలీలో పెళ్లి కావాల్సిన హీరోలు క్యూలో ఉండగా, ఒకరి తర్వాత ఒకరికి పెళ్లి చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకోనుండగా, ఇప్పటివరకు ఆ పెళ్లి తేది ప్రకటించలేదు. ఇటీవల తన పెళ్లి నవంబర్‌లో ఉండొచ్చని చూచాయగా చెప్పారు.
పెళ్లి చాలా సింపుల్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగే అవకాశం ఉందని కూడా అన్నారు. పెళ్లికి మరెంతో సమయం లేకపోవడంతో ఏర్పాట్లని మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. తాజాగా నాగబాబు, వరుణ్ తేజ్, నిహారిక, పద్మజ విదేశాలకు వెళ్లారు. ఫ్యామిలీ అంతా విదేశాలకి వెళ్లడంతో వారు ఎందుకు వెళ్లారు అనే దానిపై చర్చ మొదలైంది.
ప్రస్తుతం నాగబాబు ఫ్యామిలీ ఆఫ్రికా దేశంలో ఉన్నట్లు తెలుస్తుంది.అక్కడ అందరు వైల్డ్ సఫారీ చేస్తున్నారు. ఇదే క్రమంలో వరుణ్ తేజ్ వివాహ వేదికకు సంబంధించిన లొకేషన్ సెలెక్ట్ చేస్తారేమో అని అంటున్నారు. ఈ సారి ఫ్యామిలీ అంతా ఇలా టూర్ వెళ్లడానికి కారణం వరుణ్ తేజ్ వివాహ వేదికని సెలక్ట్ చేయడానికి అని తెలుస్తుంది.
వరుణ్ తేజ్ పెళ్లి ఆగస్ట్‌లోనే జరగాల్సి ఉండగా, నిహారిక విడాకుల వలన కొంత గ్యాప్ ఇచ్చారు. భర్త వెంకట చైతన్య జొన్నలగడ్డ నుండి విడిపోయినప్పటి నుండి నిహారిక తెగ చక్కర్లు కొడుతుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఆమె ఎక్కువ సమయం గడపాలని అనుకుంటుంది. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా రాణించే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల ఆఫీస్ ఓపెన్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ రూపొందించే పనిలో ఉంది నిహారిక.
ఇక నాగబాబు నటుడిగా అడపాదడపా చిత్రాలు చేస్తూనే అదే సమయంలో జనసేన కీలక నేతగా ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు.
ఆయన నటించిన ఎఫ్ 3, గని, గాండీవధారి అర్జున చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. గాండీవధారి అర్జున చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నా కూడా ఈ చిత్రం వరుణ్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ అయ్యింది. ఈ బ్యాడ్ మూడ్ నుండి బయటపడేందుకు వరుణ్ కి ఈ టూర్ ఎంతో కొంత సహాయపడుతుంది. త్వరలో మట్కా అనే చిత్రంతో పలకరించబోతున్నాడు.