Tamanna Bhatia | చైతూ చాలా మంచోడు: తమన్నా! అంటే సమంతే.. కావాలని వదిలేసిందా?

Tamanna Bhatia విధాత‌: నాగ చైతన్య, సమంతలు ఎందుకు విడిపోయారో, వారి మధ్య అసలు ఏం జరిగిందీ అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. ప్రముఖంగా వినిపించింది మాత్రం.. ఆమె బోల్డ్ పాత్రలు చేయడం చైతూ నచ్చలేదని, ఆ విషయం చెబితే.. నా స్వేచ్ఛకు అడ్డుపడవద్దని సమంత చెప్పిందని.. అక్కడే ఇద్దరికీ చెడిందనేలా వార్తలైతే వచ్చాయి కానీ.. విషయం ఏమిటనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు. అయితే ఇప్పుడు తమన్నా చేసిన కామెంట్స్‌తో మరోసారి చైతూ, సమంతలు […]

Tamanna Bhatia | చైతూ చాలా మంచోడు: తమన్నా! అంటే సమంతే.. కావాలని వదిలేసిందా?

Tamanna Bhatia

విధాత‌: నాగ చైతన్య, సమంతలు ఎందుకు విడిపోయారో, వారి మధ్య అసలు ఏం జరిగిందీ అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. ప్రముఖంగా వినిపించింది మాత్రం.. ఆమె బోల్డ్ పాత్రలు చేయడం చైతూ నచ్చలేదని, ఆ విషయం చెబితే.. నా స్వేచ్ఛకు అడ్డుపడవద్దని సమంత చెప్పిందని.. అక్కడే ఇద్దరికీ చెడిందనేలా వార్తలైతే వచ్చాయి కానీ.. విషయం ఏమిటనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు.

అయితే ఇప్పుడు తమన్నా చేసిన కామెంట్స్‌తో మరోసారి చైతూ, సమంతలు వార్తలలో నిలుస్తున్నారు. హీరోయిన్లు ఎవరిని ఎప్పుడు పొగుడుతారో, ఎవరిని ఎప్పుడు తిడతారో చెప్పడం కష్టం. కాకపోతే టాలీవుడ్ హీరోలని మెచ్చుకుంటూ తాజాగా తమన్నా కొన్ని అభిప్రాయాలను షేర్ చేసుకుంది. అందులో చైతూ పేరు ప్రత్యేకంగా చెప్పడంతో.. చైతూ, సమంతల విడాకుల విషయంలో సమంతదే తప్పు అన్నట్లుగా కొందరు పిక్చరైజ్ చేస్తున్నారు.

తమన్నా విషయానికి వస్తే.. ఈ మిల్కీ బ్యూటీ రీసెంట్‌గా నటించిన వెబ్ సిరీస్‌లలో చేసిన రచ్చకు సోషల్ మీడియా షేకయింది. ఆమె బోల్డ్‌నెస్ చూసి.. అంతా ఏకీ పారేశారు. ఆ వేడింకా తగ్గకముందే తమన్నా టాలీవుడ్ హీరోలని తెగ పొగిడేయడం వెనక అసలు కారణాలు ఏమై ఉంటుందా? అని ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో తమన్నా టాలీవుడ్ హీరోలు హీరోయిన్స్‌తో ప్రవర్తించే విధానం చాలా మర్యాదగా ఉంటుందని, వాళ్ళతో నటించాలంటే హీరోయిన్స్ చాలా కంఫర్ట్‌గా భావిస్తారని ఎటువంటి ఇబ్బంది ఉండదని తెగ పొగిడేసింది.

అందులో ముఖ్యంగా రామ్ చరణ్, నాగ చైతన్యల పేరును ప్రస్తావించింది. వాళ్లతో నటించడం చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. హీరోయిన్స్‌ని వారు చాలా మర్యాదగా చూసుకుంటారని వెల్లడించింది. ఈ మర్యాద వారికి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారానే వచ్చి ఉంటుందని మెచ్చుకుంది.

రామ్ చరణ్‌తో ‘రచ్చ’, నాగచైతన్యతో ‘100 పర్సంట్ లవ్’, ‘తడాఖా’ వంటి సినిమాలలో తమన్నా నటించింది. అయితే ఆమె చెప్పిందంతా బాగానే ఉంది.. చెప్పిన తర్వాత ముఖ్యంగా చైతూ మ్యాటర్ బాగా వైరల్ అవుతోంది. చైతూ మంచోడని, సమంతే కావాలని తన కాపురాన్ని చెడగొట్టుకుందనేలా.. అక్కినేని అభిమానులు మాట్లాడడానికి తమన్నా ఛాన్సిచ్చింది.

ఇక ఇదే ఇంటర్వ్యూలో తమన్నా.. మెగాస్టార్ చిరంజీవి గతంలో ఓ సందర్భంలో చెప్పిన మాటలను గుర్తుచేసుకుంది తమన్నా. భవిష్యత్తులో నువ్వు గొప్ప హీరోయిన్ అవుతావనే మాట ఆయన అన్నారట. ఆ విషయం గుర్తు చేసుకుని ఎంతో పొంగిపోయింది. ఇప్పుడు మెగాస్టార్ సరసన ‘భోళాశంకర్’ చిత్రంలో ఆమె చేస్తుంది. ఇంతకు ముందు మెగాస్టార్ సరసన ‘సైరా’ సినిమాలోనూ ఆమె నటించింది.

వెబ్ సిరీస్‌లతో పాటు త్వరలోనే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో ప్రేక్షకుల ముందు మెరవనుంది తమన్నా. రజనీకాంత్‌తో చేసిన ‘జైలర్’, చిరంజీవితో చేస్తున్న ‘భోళాశంకర్’.. ఈ రెండు సినిమాలు ఆగస్ట్‌లో ఒక్క రోజు గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం.. తమన్నా మరిన్ని ఛాన్స్‌లు దక్కించుకోవడం ఖాయం.