Nalgonda | సాంకేతిక మంత్రం..! “నాగా”స్త్రం వేగం!

కాషాయ దళంలో కదనోత్సాహం విధాత: ఆధునిక సాంకేతిక ప్రభావం అన్ని రంగాల మాదిరిగానే రాజకీయ రంగాన్ని సైతం శాసిస్తున్న నేపథ్యంలో నాయకులు కూడా తమ రాజకీయ ప్రచారానికి సాంకేతికత వినియోగాన్ని, హంగులను జోడిస్తూ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. సోషల్ మీడియాను, డిజిటల్ ప్రచార ప్రసార సాధనాలను, డ్రోన్ కెమెరాలను తమ రాజకీయ కార్యక్రమాల కవరేజ్ కు వినియోగిస్తూ ప్రచారాల్లో హైప్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. యువతరం నాయకత్వం అయితే నూతన సాంకేతిక ప్రచార పరిజ్ఞానాన్ని ఒడుపుగా […]

  • Publish Date - April 10, 2023 / 07:58 AM IST
  • కాషాయ దళంలో కదనోత్సాహం

విధాత: ఆధునిక సాంకేతిక ప్రభావం అన్ని రంగాల మాదిరిగానే రాజకీయ రంగాన్ని సైతం శాసిస్తున్న నేపథ్యంలో నాయకులు కూడా తమ రాజకీయ ప్రచారానికి సాంకేతికత వినియోగాన్ని, హంగులను జోడిస్తూ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు.

సోషల్ మీడియాను, డిజిటల్ ప్రచార ప్రసార సాధనాలను, డ్రోన్ కెమెరాలను తమ రాజకీయ కార్యక్రమాల కవరేజ్ కు వినియోగిస్తూ ప్రచారాల్లో హైప్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. యువతరం నాయకత్వం అయితే నూతన సాంకేతిక ప్రచార పరిజ్ఞానాన్ని ఒడుపుగా వాడుతూ జనంలోకి వేగంగా దూసుకెళ్తున్నారు.

ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా బిజెపి రాజకీయాల్లో ఇటీవల కొత్తముఖంగా రాజకీయ రంగంలో అడుగుపెట్టిన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆధునిక సాంకేతిక ప్రచార సాధనాలను అందిపుచ్చుకొని వేగంగా జనంలో గుర్తింపు తెచ్చుకోవడం అందరిని ఆకట్టుకుంటుంది.

వర్షిత్ రెడ్డి తన రాజకీయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో పెడుతూ జనాన్ని ముఖ్యంగా యువతరాన్ని ఆకర్షిస్తున్నారు. ప్రత్యేక పర్వదినాలు, మహనీయుల స్మారక దినోత్సవాలతో పాటు మోడీ ప్రభుత్వ పథకాలతో, పార్టీ కార్యక్రమాలతో, వర్తమాన రాజకీయ సామాజిక అంశాలపై స్పందనలతో సోషల్ మీడియాలో చిత్రాలతో కూడిన పోస్టులు పెడుతూ నిత్యం జనంలో తన ఉనికి చాటుతున్నారు.

పార్టీ పరమైన కార్యక్రమాలతో పాటు నాగం ఫౌండేషన్ ద్వారా ఉచిత మెగా హెల్త్ క్యాంపు లు, క్రీడా పోటీల నిర్వహణతో ఉద్యోగ, ఉపాధ్యాయ యువజన, విద్యార్థి, ఆధ్యాత్మిక, కుల సంఘాలకు చేయూతతో నాగం సందడి చేస్తున్నారు. సదరు కార్యక్రమాల ప్రచారంతో పాటు బిజెపి పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వర్షిత్ రెడ్డి క్షేత్రస్థాయిలో చూపుతున్న జోరుకు సాంకేతికతను జోడించి ప్రచార రంగంలో దూసుకెళ్తున్న తీరు ఆ పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం కలిగిస్తుంది.

ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ఆశావహులు మాత్రం గోడల మీద రాతలతో పోటీలు పడుతూ జిల్లా కేంద్రం నల్గొండ పట్టణాన్ని తమ ప్రచార రాతలతో నింపేస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భవనాల ప్రహరీ గోడలను కూడా వదలకుండా గోడ ప్రచారాలు నిర్వహించారు.

సోషల్ మీడియా హవా సాగుతున్న నేటి రోజుల్లో గోడలపై రాతలతో అధికారపక్ష నేతలు తమకున్న అధికార అండతో ప్రచారంలో పోటీ పడుతుంటే, ప్రతిపక్ష నేతలు సామాజిక మాధ్యమాల బాసటతో తమ ప్రచారాన్ని ముందుకు దూకిస్తున్న తీరు విభిన్న ప్రచార శైలులకు నిదర్శనంగా నిలిచి జనంలో నాయకుల ప్రచార తీరుతెన్నులను చర్చనీయాంశం చేశాయి.