బెల్ట్ ప‌ట్టుకొని.. కంటెస్టెంట్స్‌తో చెడుగుడు ఆడిన నాగార్జున‌

  • By: sn    latest    Oct 01, 2023 1:16 AM IST
బెల్ట్ ప‌ట్టుకొని.. కంటెస్టెంట్స్‌తో చెడుగుడు ఆడిన నాగార్జున‌

బెల్ట్ ప‌ట్టుకొని కంటెస్టెంట్స్‌తో చెడుగుడు ఆడిన నాగార్జున‌బిగ్ బాస్ సీజ‌న్ 7లో శ‌నివారం ఎపిసోడ్ కాస్త రంజుగా సాగింది. బెల్ట్ ప‌ట్టుకొని ఒక్కొక్క‌రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెల్ట్ పట్టుకుని సీన్లోకి ఎంటర్‌ అయిన కింగ్ నాగార్జున.. హౌస్ మేట్స్‌ను సీరియ‌స్‌గా చూస్తూ సంచాల‌కులిగా ఉన్న శివాజీ, సందీప్‌ల‌కి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాఇడు.



బెల్ట్ ప‌ట్టుకొని గౌత‌మ్ గొంతు లాగడం ప‌ట్ల తేజ‌పై సీరియ‌స్ అయ్యారు. తేజ చేసిన ప‌ని ప‌ట్ల ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంద‌ని కంటెస్టెంట్స్‌ని అడిగారు నాగార్జున‌. తేజ‌ని ఇంటికి పంపాల‌ని సందీప్ అన్నారు. గౌత‌మ్ నిజంగా జెంటిల్‌మెన్ గా బిహేవ్ చేశాడంటూ అత‌డిని అప్రిషియేట్ చేశారు నాగ్.



ఇక సుబ్బుకి ఓ వీడియో చూపించి శివాజీ నీతో మిస్ బిహేవ్ ,చేశాడా అని అడిగాడు నాగ్. అస‌లు అక్క‌డ ఏం జ‌రిగిందో చూపించిన నాగార్జున శివాజీ ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల హౌజ్‌మేట్స్ ని అడిగారు నాగ్. అయితే ఒక్క రితికా త‌ప్ప అంద‌రు కూడా శివాజీ త‌ప్పు లేద‌ని అన్నారు.



ఇక ప్ర‌శాంత్ గురించి మాట్లాడిన నాగార్జున గౌత‌మ్‌ని నామినేట్ చేస్తూ చెప్పిన రీజ‌న్ గురించి చర్చిస్తారు. ఇక యావ‌ర్ తినే ఫుడ్ మీద కోపం చూపించ‌డంతో నాగార్జున త‌న‌దైన శైలిలో యావ‌ర్‌కి పంచ్‌లు వేశాడు. కోపం.. కసి వేరు వేరని.. కోసితో ఆడు.. కోపంతో కాదంటూ క్లాస్ పీకుతారు. డోంట్‌ లూస్ కంట్రోల్ అంటూ.. ప్రిన్స్‌కు సూచిస్తారు నాగార్జున‌.



ఇక అనంతరం శివాజీ, సందీప్, శోభ ఈ ముగ్గరి హౌస్‌మేట్స్ అండ్ సంచాలకులలో.. ఎవరు పార్షల్ అండ్ బయాసో చెప్పాలంటూ.. ఒక్కో కంటెస్టెంట్స్‌ను యాక్టివిటీ రూంలోకి పిలిచి మరీ అడుగుతుంటారు నాగార్జున‌. అయితే మొదట యాక్టివిటీ రూంలోకి వచ్చిన ప్రిన్స్.. సందీప్‌ను బయాస్డ్‌గా పిక్ చేసుకోగా.. రతిక శివాజీని పిక్ చేసుకుంటుంది.



ఇక ర‌తిక .. ప్ర‌శాంత్‌ని దారుణంగా తిట్ట‌డంపై నాగార్జున మంద‌లించారు. ఇక అమ‌ర్‌ని యాక్టివిటీ రూమ్‌కి పిలిచి తన దృష్టిలో ఎవరు బయాస్డో అడుగుతారు. అయితే అమర్‌ శివాజీని నామినేట్ చేయగా.. తేజ.. తనకు ఎవరూ అనిపించలేదంటూ చెబుతాడు. ఇక నామినేషన్స్‌లో గౌత‌మ్ బూతు మాట్లాడడం పై మందలిస్తారు నాగార్జున‌. ఇక టేస్టీ తేజకి జైలు శిక్ష, గౌతమ్ చెప్పిన పనులు చేయడంతో పాటు నెక్స్ట్ వీక్ డైరెక్ట్ గా నామినేషన్స్ లో ఉంచుతున్నట్లు నాగార్జున తెలిపారు.