Nagarjuna Sagar
విధాత: నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ గిరిజన యువకుడిపై చేయి చేసుకున్నాడని పెద్దవూర మండలకేంద్రంలో గిరిజనులు ధర్నా చేశారు. వివరాల్లోకి వెళితే.. నీమానాయక్ తండా గ్రామ పంచాయతి పరిధిలోని ఆమ్లెట్ తండాలు అయిన పుల్యా నాయక్ తండ, మల్లే వాని కుంట తండ, ఊరబాయి తండ, బెట్టేల తండలను వేరు చేసి పూల్యతండా, మల్లెవాని కుంట తండాలను కలిపి నూతన గ్రామపంచాయతీ చేయాలని ఎమ్మెల్యే భగత్ నిర్ణయించుకున్నారని, అది తమకు ఇష్టం లేదని నీమా నాయక్ తండాలోనే కలిసి ఉంటామని మల్లేవాని కుంట తండా ప్రజలు ఎమ్మెల్యేకు పలుమార్లు వినితీ పత్రాలు అందజేశామన్నారు.
అయినా కూడా ఎమ్మెల్యే, నిమానాయక్ తండా సర్పంచ్ ఇద్దరూ కలిసి తొమ్మిది మంది వార్డు మెంబర్లతో మాయ మాటలు చెప్పి తీర్మానాల మీద సంతకాలు చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. అనంతరం ఆ తీర్మానాలను కార్యదర్శి, సర్పంచ్ కలిసి మండల ఎంపీడీఓ కార్యాలయం నుంచి జిల్లా పంచాయతి కార్యాలయానికి పంపించడం జరిగిందని మల్లెవాని కుంట తండా ప్రజలు వెల్లడించారు.
దీంతో హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే నివాసానికి వెళ్లిన మల్లేవాని కుంట తండ ప్రజలు ఎమ్మెల్యే భగత్‌కు మా తండాను వేరు చేయోద్దని అడగగా కోపోద్రీక్తుడైన భగత్ దురుసుగా ప్రవర్తించాడని, గిరిజన యువకులైన భాస్కర్, రంజిత్‌లను జుట్టుపట్టుకొని గెంటేశాడని చెప్పారు.
ఉప ఎన్నికలో సానుభూతి ద్వార ఎన్నికయ్యి, పాలనపై అవగాహన లేకుండా అధికార మదంతో గిరిజనులపై దాడి చేసిన ఎమ్మెల్యే భగత్‌పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు భాస్కర్, రంజిత్‌లతో పాటు పలువురు గిరిజన నాయకులు, మల్లెవాని కుంట తండా ప్రజలు డిమాండ్ చేశారు.