మూడో హౌజ్‌మేట్‌గా శోభా శెట్టి.. ఒక్కొక్కరికి గట్టిగా ఇచ్చి పడేసిన నాగార్జున

బిగ్ బాస్ తెలుగు 7 సక్సెస్ ఫుల్‌గా మూడో వారంకి చేరుకుంది. వీకెండ్ వస్తే నాగార్జున కంటెస్టెంట్స్‌తో కలిసి సందడి చేయడమే కాకుండా వారికి తనదైన శైలిలో చురకలు కూడా అంటిస్తుంటారు. కొందరు సేఫ్ గేమ్ ఆడడం పట్ల నాగార్జున మండిపడ్డారు.టేస్టీ తేజ, అమర్ దీప్, రతికలు సేఫ్ గేమ్ ఆడుతున్నారని, ఇక శుభ శ్రీ, ప్రశాంత్ లు గేమ్ ఆడుతున్నట్టు కనిపించడం లేదని నాగార్జున మండిపడ్డాడు. ఇక సంచాలక్‌గా వ్యవహరించిన సందీప్‌పై ఏకంగా ఫైర్ అయ్యాడు. తన విధులు సరిగా చేయలేకపోయాడని,గేమ్ అర్థం చేసుకోలేకపోయాడని నాగార్జున అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సందీప్ సంచాలక్‌గా చేసిన తీరుపై కంటెస్టెంట్స్ నిర్ణయం తీసుకుంటారు నాగార్జున. చాలా మంది సభ్యులు సందీప్ సంచాలకుడిగా ఫెయిల్ అయ్యాడని అని చెప్పడంతో.. నాగ్ సందీప్ పై చాలా సీరియస్ అవుతారు. నువ్వు ఏమన్న పిస్తావా.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ.. లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకుతారు. ఇక మూడో వారం హౌజ్‌లో స్థానం సంపాదించేందుకు పోటీ పడిన ప్రియాంక, శోభా శెట్టిలలో శోభా శెట్టి విన్నర్ అయిందని నాగార్జున తెలియజేస్తారు. శోభ 12 సెకన్ల తేడాతో.. ప్రియాంక మీద గెలిచిందని నాగార్జున చెప్పడంతో శోభ ఆనందానికి అవధులు అనేవి ఉండవు.ఈ క్రమంలో సందీప్, శివాజీ తర్వాత శోభా మూడో హౌజ్ మేట్ కావడం విశేషం.
ఇక హౌజ్‌లో సేఫ్ గేమ్ ఆడుతున్నది ఎవరు, గేమ్ ఛేంజర్ ఎవరు అనే టాస్క్ నాగార్జున ఇవ్వగా, ఇందులో గేమ్ చేంజర్‌గా యావర్ ఎక్కువ ఓట్స్ దక్కించుకున్నాడు. తేజ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని చాలా మంది ఆయనకి ఓట్స్ వేసారు.. దీంతో తేజకి హౌజ్‌లో ఉన్న అన్ని అంట్లు తోమే శిక్ష విధించాడు నాగార్జున. ఇక సంచాలక్‌గా సందీప్ సరైన గేమ్ ఆడని క్రమంలో అతనికి జైలు శిక్ష వేసారు. రతిక ఈ మధ్య సైలెంట్‌గా ఉందని, గేమ్ ఆడడం లేదని నాగార్జున చెప్పగా, దానికి రతిక కూడా హూ అంది.
ఈ క్రమంలో ఆమె పవర్ గ్రీన్ నుంచి ఎల్లోకి అట్నుంచి రెడ్ సింబల్లో కి డౌన్ అయిపోవడంతో అందులో తన మాజీ లవ్ స్టోరీ గుర్తొస్తుందని చెప్పడం గమనర్హం.ఇక అమర్ దీప్‌ని కూడా గట్టిగానే క్లాస్ పీకాడు నాగార్జున. మొత్తానికి శనివారం ఎపిసోడ్ సందడిగానే సాగిన ఆదివారం ఎపిసోడ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.