NALGONDA: అంబేద్కర్ విగ్రహం ఎదుట అక్షరాభ్యాసం..! సరికొత్త ఒరవడికి యువకుడు శ్రీకారం
విధాత: పిల్లల అక్షరాభ్యాసానికి ఎక్కువగా బాసర సరస్వతి అమ్మవారి వద్దకు, మరికొందరు తమ ప్రాంతాల్లోని దేవాలయాలకు, ఇష్టదైవం గుడులకు వెళ్లడం లేదా ఇంట్లో ప్రత్యేక పర్వదినాలు, శుభ దినాలను ఎంచుకుని తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం చూశాం. అయితే నల్గొండ పట్టణానికి చెందిన పెరిక వెంకట్, కీర్తన దంపతులు తమ ప్రథమ కుమారుడైన పెరిక సోహాన్‌కు ఆదివారం జిల్లా కేంద్రం నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్అంబేద్కర్ విగ్రహం ఎదుట అక్షరాభ్యాసం చేయించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు […]

విధాత: పిల్లల అక్షరాభ్యాసానికి ఎక్కువగా బాసర సరస్వతి అమ్మవారి వద్దకు, మరికొందరు తమ ప్రాంతాల్లోని దేవాలయాలకు, ఇష్టదైవం గుడులకు వెళ్లడం లేదా ఇంట్లో ప్రత్యేక పర్వదినాలు, శుభ దినాలను ఎంచుకుని తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం చూశాం.
అయితే నల్గొండ పట్టణానికి చెందిన పెరిక వెంకట్, కీర్తన దంపతులు తమ ప్రథమ కుమారుడైన పెరిక సోహాన్‌కు ఆదివారం జిల్లా కేంద్రం నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్అంబేద్కర్ విగ్రహం ఎదుట అక్షరాభ్యాసం చేయించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు .
TRSV పట్టణ అధ్యక్షుడైన పెరికె వెంకట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ మేధావి, విశ్వ జ్ఞాని, భారత రాజ్యంగా నిర్మాత, భారతరత్న డా బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట జై భీమ్ అని రాయించి అక్షరాభ్యాసం చేయించడం సంతోషంగా, స్ఫూర్తి దాయకంగా ఉందన్నారు.
మహనీయులను స్మరించుకోవడం, వారి ఆశయాలను చిన్నతనం నుండే పిల్లలు అలవర్చుకోవాలని చాటేందుకే తాను ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అణగారిన వర్గాల కోసం అనునిత్యం పోరాడి వారిని సామాజిక వివక్షత నుంచి విముక్తి చేసిన దేవుడు అంబేద్కర్ అన్నారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద అక్షరాభ్యాసం చేయించడం ద్వారా పిల్లలు ఆ మహనీయుడి అడుగుజాడల్లో నడిచి సమాజానికి ఒక దిక్సూచి లాగా జీవించాలని , రాజ్యాధికారం సాధించే దిశగా ఎదగాలని తాను కోరుకున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పెరిక దివాకర్, గురుమూర్తి, లక్ష్మి , రవితేజ, చాణుక్య, పృథ్వి , మానస తదితరులు పాల్గొన్నారు