NALGONDA: ఇంటింటి క్రైస్తవ మత ప్రచారాన్ని అడ్డుకున్న భజరంగ్ దళ్

విధాత: నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఇంటింటి క్రైస్తవ మత ప్రచారాన్ని భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి కార్లలో వచ్చిన మతప్రచారకులు ఇంటింటికీ తిరుగుతూ మత ప్రచారం నిర్వహిస్తుండగా స్ధానికులతో కలిసి భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. భజరంగ్ దళ్ కార్యకర్తల రాకతో కొంతమంది ఫాస్టర్లు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘటనపై స్థానికులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. NALGONDA: […]

  • Publish Date - February 11, 2023 / 08:28 AM IST

విధాత: నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఇంటింటి క్రైస్తవ మత ప్రచారాన్ని భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. హైదరాబాద్ నుంచి కార్లలో వచ్చిన మతప్రచారకులు ఇంటింటికీ తిరుగుతూ మత ప్రచారం నిర్వహిస్తుండగా స్ధానికులతో కలిసి భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

భజరంగ్ దళ్ కార్యకర్తల రాకతో కొంతమంది ఫాస్టర్లు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘటనపై స్థానికులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు.