Site icon vidhaatha

Nalgonda | బావను హత్య చేసిన బామ్మర్ది

Nalgonda

విధాత: నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం అంగడిపేట స్టేజి వద్ద డిస్ట్రిబ్యూటరీ కెనాల్ లో ఓ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు.

అతడిని సొంత బామ్మర్ది గుర్రంపోడు మండలం మోసంగికి చెందిన నిరసనగండ్ల వెంకటయ్య హత్య చేసి గోన సంచిలో మూటగట్టి కాలువలో పడేసినట్లుగా పోలీసులు తెలిపారు. సోదరితో కలిసి వెంకటయ్య తన బావ ఆంజనేయులును హత్య చేసినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version