Nalgonda | అభివృద్ధికి అడ్డం పడుతున్న ప్రతిపక్షాలు: మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజం

Nalgonda నల్లగొండ, భువనగిరిలలో వీఆర్‌ఏలకు రీ అలాట్మెంట్‌ అర్డర్ల పంపిణీ జేపీఎస్‌లకు రెగ్యులైజేషన్ ప్రొసిడింగ్స్‌ అందచేత విధాత: దేశానికి ఆదర్శనీయ రీతిలో సాగతున్న తెలంగాణ అభివృద్ధికి ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు రకరకాలుగా అడ్డుపడుతున్నాయని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ, భువనగిరిలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వీఆర్‌ఏలకు రీ అలాట్మెంట్‌ ఆర్డర్స్‌, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ మానవీయ కోణంలో సీఎం కేసీఆర్ […]

Nalgonda | అభివృద్ధికి అడ్డం పడుతున్న ప్రతిపక్షాలు: మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజం

Nalgonda

  • నల్లగొండ, భువనగిరిలలో వీఆర్‌ఏలకు రీ అలాట్మెంట్‌ అర్డర్ల పంపిణీ
  • జేపీఎస్‌లకు రెగ్యులైజేషన్ ప్రొసిడింగ్స్‌ అందచేత

విధాత: దేశానికి ఆదర్శనీయ రీతిలో సాగతున్న తెలంగాణ అభివృద్ధికి ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు రకరకాలుగా అడ్డుపడుతున్నాయని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ, భువనగిరిలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన వీఆర్‌ఏలకు రీ అలాట్మెంట్‌ ఆర్డర్స్‌, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్స్‌ను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ మానవీయ కోణంలో సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని, కొట్లాడి సాధించిన తెలంగాణ లో అందరూ సంతోషంగా ఉండాలన్నదే కేసీఆర్ తపన అన్నారు. అందుకే విద్యుత్తు శాఖలో వేల మందిని రెగ్యులర్ చేశారని, ఇవ్వాళ వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శిలను గౌరవిస్తూ, అందరిని పర్మినెంట్ చేశారన్నారు.

సీఎం కేసీఆర్ ఉద్యోగులు అడిగినదాని కంటే ఎక్కువగానే చేశారని, ఏ మంచి పని చేసినా కొంత మంది చెడగొట్టే వాళ్ళు వుంటారన్నారు. ఇది దౌర్భాగ్యకరమని, కొంత మంది దుర్మార్గులు భగీరథ పథకం చేపడితే కూడా కేసులు వేశారన్నారు. నల్గొండ జిల్లాకు, సూర్యాపేట జిల్లాకు గోదావరి నుంచి నీళ్లు అందిస్తున్నామని, దేవరకొండ, మునుగోడు ప్రాంతలాల్లో సాగు నీరు అందించాలని ప్రభుత్వం చేపట్టిన డిండి ప్రాజెక్టు పైన కూడా కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారు.

కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రతిపక్షాలు దొంగ కేసులు వేసి అడ్డం పడటంతో పాటు నిరుద్యోగు లను రెచ్చగొట్టి కేసులు వేస్తున్నారన్నారు. తెలంగాణను 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసాయని విమర్శించారు. వీఆర్‌ఏలు, జేపీఎస్‌ల ఉద్యోగ కష్టాలను అర్ధం చేసుకుని వారికి ఉద్యోగ సర్ధుబాటు, క్రమబద్ధీకరణ చేశారన్నారు. ఉద్యోగుల కృషితో తెలంగాణ పల్లెలు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డ్ లను దక్కించుకుంటున్నాయన్నారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శిలు చిత్తశుద్ధితో పని చేసి పల్లెలను అందంగా తీర్చిదిద్దారని, ఇవ్వాళ వాళ్ళను అందరిని శాశ్వత ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ మార్చారన్నారు. సీఎం కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమైన ప్రాజెక్టు అని, ప్రపంచంలో ఎవ్వరు చేయని సాహసం చేసి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ రేయింబవళ్లు కష్టపడ్డారన్నారు.

గొప్ప మానవతా వాదిగా సీఎం కేసీఆర్ సాగిస్తున్న పాలనలో తెలంగాణలోని అన్ని వర్గాలు, అన్ని కులాల వాళ్ళు సంతోషంగా ఉన్నారన్నారు. ఇవ్వాళ తెలంగాణతో పోటీ పడే రాష్ట్రం లేనే లేదని, ఇవ్వాళ మనకు మనమే సాటి, పోటీ అని, మరో ఐదేళ్ళలో తెలంగాణను చూసి అమెరికా సైతం నేర్చుకునేలా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని జగదీశ్‌రెడ్డి చెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, ఆర్‌.రవీంద్ర కుమార్, ఎన్‌.భాస్కర్ రావు, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, అయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఆయా జిల్లాల కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, కర్ణన్, ఎస్పీ అపూర్వరావు, ఉన్నత విద్యామండలి సభ్యులు ఒంటెద్దు నరసింహ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, గ్రంధాలయ చైర్మన్ మల్లికార్జున రెడ్డి అధికారులు పాల్గొన్నారు.