Nalgonda | పంటల సాగును ముందుకు తీసుకు రావాలి: మంత్రి జగదీష్ రెడ్డి

Nalgonda మే మాసాంతానికి మొదటి పంట.. నవంబర్ చివరికి రెండో పంట నాట్లు పూర్తికి జడ్పీలో తీర్మానం విధాత: పంటల సాగును ముందుకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఅర్ తీసుకుంటున్న నిర్ణయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలనుండి రైతాంగాన్ని కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సంచలాత్మక నిర్ణయం గైకొన్నారని ఆయన వెల్లడించారు. శనివారం నాడు జరిగిన నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య […]

  • Publish Date - May 27, 2023 / 12:11 PM IST

Nalgonda

  • మే మాసాంతానికి మొదటి పంట..
  • నవంబర్ చివరికి రెండో పంట నాట్లు పూర్తికి జడ్పీలో తీర్మానం

విధాత: పంటల సాగును ముందుకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఅర్ తీసుకుంటున్న నిర్ణయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలనుండి రైతాంగాన్ని కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సంచలాత్మక నిర్ణయం గైకొన్నారని ఆయన వెల్లడించారు. శనివారం నాడు జరిగిన నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన స‌మావేశం జ‌రిగింది.

ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మే మాసాంతానికి మొదటి పంట.. నవంబర్ చివరికి రెండో పంట నాట్ల పూర్తికి ప్రభుత్వం సంకల్పించిదని ఆయన వెల్లడించారు. మార్చి చివరికి ధాన్యం కొనుగోలు పూర్తీ అవుతుందంటూ వివరించారు. అందుకు అనుగుణంగా జెడ్ పి ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా సభ ఏకగ్రవంగా తీర్మానించింది.

అనంతరం సభలో పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో మాట్లాడగా అందుకు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి తుఫాన్ కు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన స్పష్టం చేశారు. ఈ తరహాలో భారత దేశంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన మరో రాష్ట్రం ఎక్కడా లేదన్నారు.

నిజం చెప్పాలి అంటే ధాన్యం కొనుగోలులో అధికారులు అభినందనీయులు అని ఆయన ప్రశంసించారు. విధానాలను అమలు పరిచే బాధ్యత వరకు శాసనకర్తలకు పరిమితమని అమలు పరిచే బాధ్యత ఖచ్చితంగా అధికారుల మీద ఉంటుందని ఆయన పేర్కన్నారు. అక్కడక్కడా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు సూచనలు చెయ్యాలని, రాద్దాంతం చేయడం ద్వారా ఒన గూరే ప్రయోజనం ఉండదన్నారు.

పైగా యావత్ భారతదేశంలోనే మొట్ట మొదటి సారిగా కళ్లాల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. మొత్తంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి రైతుపక్షపాతిగా పేరొందిన నేత అని ఆయన కితాబిచ్చారు. రైతాంగం గురించి ఆలోచించే మొట్టమొదటి ప్రభుత్వం మనదేన‌న్నారు.

ప్రతీ మీడియా హౌస్ కు ఓ ఎజెండా ఉందని ఆయన అన్నారు. జరుగుతున్న దానిని జరగ లేదని చెప్పేందుకు ఆ మీడియా హౌస్ లు పోటీ పడుతున్నాయన్నారు. అభివృద్ధి యిష్టం లేని పత్రికలు ఈ తరహ ప్రచారానికి పూనుకున్నార‌ని ఆయన మండి పడ్డారు. ఇన్నేళ్ల నుండి రైతాంగం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విరుచుకుపడ్డారు. ఎవరి ఎజెండాలను ఉటంకించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అటువంటి ట్రాప్ లో ఏ ఒక్కరూ పడొద్దని ఆయన ప్రజా ప్రతినిధులకు ఉద్బోధించారు.

ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రజా ప్రతినిధిగా అక్కడికక్కడే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. స్ధానిక శాసన సభ్యుల దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. మీడియా హౌస్ ల ప్రచారానికి స్పందించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని ఆయన ప్రజా ప్రతినిధులకు తేల్చి చెప్పారు.

ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,
రవీంద్ర నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, జెడ్ పి వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జెడ్పి సిఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి హాజరయ్యారు.

Latest News