Nalgonda | దొరల ప్రభుత్వాన్ని దించి.. ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందాం: భట్టి

Nalgonda విధాత: తెలంగాణలో సీఎం కేసీఆర్ దొరల ప్రభుత్వాన్ని దించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపించుకొని ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 96వ రోజు సోమవారం నకిరేకల్ నియోజకవర్గంలోకి చేరుకుంది. నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున భట్టి పాదయాత్రలకు స్వాగతం పలికారు. భట్టి పాదయాత్ర 1100కిలో మీటర్ల కు చేరుకుంది. ఈ సందర్భంగా నకిరేకల్ మండలం తాటికల్‌లో కార్నర్ మీటింగ్ లో భట్టి […]

  • Publish Date - June 19, 2023 / 07:45 AM IST

Nalgonda

విధాత: తెలంగాణలో సీఎం కేసీఆర్ దొరల ప్రభుత్వాన్ని దించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపించుకొని ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 96వ రోజు సోమవారం నకిరేకల్ నియోజకవర్గంలోకి చేరుకుంది. నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున భట్టి పాదయాత్రలకు స్వాగతం పలికారు.

భట్టి పాదయాత్ర 1100కిలో మీటర్ల కు చేరుకుంది. ఈ సందర్భంగా నకిరేకల్ మండలం తాటికల్‌లో కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడారు. బిఆర్ఎస్ పాలకులు పందికొక్కుల్లాగా ప్రజల సంపదను దోపిడీ చేస్తున్నారన్నారు. నాలుగు కోట్ల ప్రజలను తాకట్టు పెట్టి ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళ తీయించారన్నారు.

ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం దగా చేసిందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొలువులు రాక విద్యార్థి, నిరుద్యోగులు గడ్డాలు పెంచుకొని రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళను ఉన్నత చదువులు చదివించిన వారి తల్లిదండ్రుల ఆశలను బిఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చిందన్నారు.

ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. తరుగు పేరిట క్వింటాకు 12 కిలోలు కోత విధిస్తూ రైతులను నిలువున ముంచుతున్న దళారుల ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.

బిఆర్ఎస్ పాలన 10 సంవత్సరాల కాలంలో ఇంటికి ఒక్క కొలువు రాలేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు కావడం లేదన్నారు. పేదలకు ఇండ్లు రావడం లేదన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఇవ్వగా ఒకరికి కోత పెట్టి ఒకరికే ఇస్తున్నారన్నారు.
ప్రజల సంపదను దోచి ఎన్నికల్లో విచ్చల విడిగా పంపిణీ చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ దొర చేస్తున్న దోపిడి వల్ల సాధించుకున్న తెలంగాణ లక్ష్యాలు నెరవేరడం లేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప ప్రజల సంపద ప్రజలకు పంచబడదన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు. ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. కూలీలకు ఏడాదికి 12వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు.

ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందిస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని రెండు లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్ల స్థలాలు లేని పేదలను గుర్తించి వారికి స్థలాలు కొనుగోలు చేసి ప్లాట్లను పంపిణీ చేస్తామన్నారు.

Latest News