Nalgonda | SPకి నల్లగొండ జర్నలిస్టుల వినతి.. అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్

Nalgonda అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ విధాత: దళిత బంధు అవినీతి వార్తా కథనం నేపథ్యంలో ఓ టీవీ చానల్(HMTV )సంస్థ పైన, జర్నలిస్ట్ అశోక్ గౌడ్ పైన బిఆర్ఎస్ నాయకులు ఆరు పోలీస్ స్టేషన్ లలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ నల్గొండ జర్నలిస్టులు శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ అపూర్వరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛను హరించేలా జర్నలిస్టులను […]

  • Publish Date - May 6, 2023 / 01:02 PM IST

Nalgonda

  • అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్

విధాత: దళిత బంధు అవినీతి వార్తా కథనం నేపథ్యంలో ఓ టీవీ చానల్(HMTV )సంస్థ పైన, జర్నలిస్ట్ అశోక్ గౌడ్ పైన బిఆర్ఎస్ నాయకులు ఆరు పోలీస్ స్టేషన్ లలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ నల్గొండ జర్నలిస్టులు శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ అపూర్వరావును కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛను హరించేలా జర్నలిస్టులను బెదిరించేలా బిఆర్ఎస్ నేతలు టీవీ ఛానల్ పైన, జర్నలిస్టు అశోక్ గౌడ్ పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం అన్యాయంగా ఉందన్నారు. వెంటనే అక్రమ కేసులను పోలీస్ శాఖ ఎత్తివేయాలని కోరారు.

సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అక్రమాలపై మాట్లాడిన అంశాలనే టీవీ చానల్ లో కథనంగా అందించారన్నారు. తక్షణమే అక్రమ కేసులను ఎత్తివేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. కేవలం జర్నలిస్టులను బెదిరించేందుకు ఆరు పోలీస్ స్టేషన్ లలో అశోక్ గౌడ్ పై కేసులు నమోదు చేశారని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

జర్నలిస్టుల వినతిపత్రం పై స్పందించిన ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ జర్నలిస్ట్ అశోక్ గౌడ్ పై పెట్టిన కేసులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.