Nalgonda | మానవత్వం లేని ప్రభుత్వం ఇది: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజం

Nalgonda విధాత: నల్గొండ పట్టణంలోని బర్కత్ పురలో కొద్ది రోజుల క్రితం స్టార్ ఫ్రూట్ మార్కెట్ లో ఏసీ కంప్రెషర్ పేలిన ప్రమాదంలో కలీం, సాజిద్ అనే ఇద్దరు మృతి చెందగా వారికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయకపోవడం బాధాకరమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ ఘటనపై కలెక్టర్ కు, ముఖ్యమంత్రికి లేఖ రాశానన్నారు. కనీసం 10 లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని, రెండు కుటుంబాలను ఆదుకోవాలని కోరడం […]

  • Publish Date - July 6, 2023 / 12:26 PM IST

Nalgonda

విధాత: నల్గొండ పట్టణంలోని బర్కత్ పురలో కొద్ది రోజుల క్రితం స్టార్ ఫ్రూట్ మార్కెట్ లో ఏసీ కంప్రెషర్ పేలిన ప్రమాదంలో కలీం, సాజిద్ అనే ఇద్దరు మృతి చెందగా వారికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయకపోవడం బాధాకరమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ఈ ఘటనపై కలెక్టర్ కు, ముఖ్యమంత్రికి లేఖ రాశానన్నారు. కనీసం 10 లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని, రెండు కుటుంబాలను ఆదుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఇంతవరకు ముఖ్యమంత్రి గాని, కలెక్టర్ గాని స్పందించకపోవడం శోచనీయమని, ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి ఎవరూ వచ్చి కలవలేదన్నారు.

ప్రభుత్వం ఉన్నది పేదవాళ్లు ఆపదలో ఉంటే ఆదుకోవడానికేనని, కనీసం, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా తీరిక లేదా అని.. ఇది మానవత్వం లేని ప్రభుత్వమని వెంకట్ రెడ్డి విమర్శించారు.

నా వంతుగా ఇప్పటికే ప్రమాద మృతుల రెండు కుటుంబాలకు. లక్ష చొప్పున రెండు లక్షల ఆర్థిక సహాయం అందించానన్నారు. తాజాగా వారి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించానన్నారు. ఆ కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానన్నారు.

కలీం, సాజిద్ పిల్లల చదువుకు అయ్యే ఖర్చు అంతా నేనే భర్తిస్తానన్నారు. కలీం, సాజిద్ కుటుంబాలకు అండగా నేనుంటానన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరోసారి లేఖ రాస్తానని తెలిపారు. ఆయన అపాయింట్ మెంట్ ఇస్తే కలిసే ప్రయత్నం చేస్తానన్నారు.

రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతీ పేదవాడికి అండగా ఉంటామని, పేదలకు అండగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉండాలే తప్ప ప్రతీది రాజకీయంగా ఉండకూడదన్నారు.

Latest News