విధాత: నల్గొండ పట్టణం అద్దంకి – నార్కట్ పల్లి హైవేపై మర్రిగూడ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
ప్రమాదంలో ఓ కారు డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టడంతో రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.