Namrata | ఏజ్ బారైనా.. త‌గ్గ‌నంటున్న మ‌హేష్ స‌తీమ‌ణి

Namrata | సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు మిస్ యూనివ‌ర్స్‌గా, హీరోయిన్‌గా అద‌ర‌గొట్టిన న‌మ్ర‌త‌.. మ‌హేష్ బాబుని పెళ్లాడాక పూర్తిగా సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. మ‌హేష్‌తో పాటు తన పిల్ల‌ల బాగోగులు చూసుకుంటూ బిజీబిజీగా గ‌డుపుతుంది న‌మ్ర‌త‌. అయితే ఇటీవ‌ల న‌మ్ర‌త‌ని మీరు రీఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉందా అనే ప్ర‌శ్న‌లు ప‌లుమార్లు ప్ర‌శ్నించారు.  దానికి ఆమె కూల్‌గా నో అనే స‌మాధానం ఇచ్చింది. అయితే సినిమాల్లోకి రాక‌పోయిన […]

  • Publish Date - September 10, 2023 / 01:04 AM IST

Namrata |

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు మిస్ యూనివ‌ర్స్‌గా, హీరోయిన్‌గా అద‌ర‌గొట్టిన న‌మ్ర‌త‌.. మ‌హేష్ బాబుని పెళ్లాడాక పూర్తిగా సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. మ‌హేష్‌తో పాటు తన పిల్ల‌ల బాగోగులు చూసుకుంటూ బిజీబిజీగా గ‌డుపుతుంది న‌మ్ర‌త‌.

అయితే ఇటీవ‌ల న‌మ్ర‌త‌ని మీరు రీఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉందా అనే ప్ర‌శ్న‌లు ప‌లుమార్లు ప్ర‌శ్నించారు. దానికి ఆమె కూల్‌గా నో అనే స‌మాధానం ఇచ్చింది. అయితే సినిమాల్లోకి రాక‌పోయిన న‌మ్ర‌త మాత్రం సోష‌ల్ మీడియాలో విధ్వ‌సం సృష్టిస్తుంది. క్యూట్ పోజుల‌తో కిరాక్ పుట్టించే విధంగా న‌మ్ర‌త లుక్స్ కేక పెట్టిస్తున్నాయి. ప్ర‌స్తుతం న‌మ్ర‌త స్టన్నింగ్ లుక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

నమ్రత ఇటీవల యాడ్స్ చేస్తూ బిజీగా ఉంది.. జ్యూవెల్లరి యాడ్స్ చేస్తున్న నేప‌థ్యంలో, ఆమె ఓ నగలకు సంబంధించి ప్రమోట్‌ చేసింది. ఇందుకోసం ఆమె ధరించిన డ్రెస్‌, ఇచ్చిన పోజులు మాత్రం అదిరిపోయాయి. ఇన్‌స్టాగ్రామ్‌ లో నమ్రత నయా ఫోటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

ఈ ఫోటోల‌లో న‌మ్ర‌త బ్రాక్‌ డ్రెస్‌లో క‌నిపించింది. బాడీకి హత్తుకున్న డ్రెస్‌లో హోయలు పోతూ సెగలు రేపింది. ఆమె పోజులిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుంది. ఆమె క‌సిగా చూస్తున్న చూపుల‌కి కుర్ర‌కారు వెర్రెక్కిపోతున్నారు. ప్రస్తుతం న‌మ‌త్ర‌ బ్యూటీ పిక్స్ నెట్టింట రచ్చ చేస్తుండ‌గా, అవి చూసిన నెటిజ‌న్స్‌కి కంటిపై కునుకు అయితే ఉండ‌డం లేదు.

నిన్న బ్లాక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేసిన నమ్రత ఇప్పుడు వైట్‌ గౌన్‌లో తెల్ల పావురంలా క‌నిపించి ర‌చ్చ చేసింది కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్ని గుచ్చేస్తుంది. నెట్టింట ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ అందాల ఫోటోలతో నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ వ‌య‌స్సులో న‌మ్రత ఇలాంటి హాట్ పోజులు ఇవ్వ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

ఐదు పదుల వ‌య‌స్సు క్రాస్ చేసిన న‌మ్ర‌త ఇప్ప‌టి హీరోయిన్లకి పోటీ ఇస్తుంది. ఫిట్‌నెస్‌ పరంగానూ తగ్గేదెలే అంటూ నిత్యం జిమ్‌లో తెగ వ‌ర్క‌వుట్స్ చేస్తుంది. ఈ క్ర‌మంలోనే త‌న బాడీని ఫిట్‌గా ఉంచుకుంటుంది. మెంటల్లీ, ఫిజికల్లీ కూడా న‌మ్ర‌త ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటుంది. తాను ఇల్లాలు అయిన‌ప్ప‌టికీ అందం విషయంలో తగ్గేదెలే అంటూ ఎప్ప‌టిక‌ప్పుడు నిరూపించుకుంటుంది మహేష్‌ వైఫ్‌.