MAD Square Teaser: ఈ సారి.. అంతకుమించిన నవ్వుల సునామీ

విధాత: మ్యాడ్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నార్నే నితిన్ (Narne Nithiin), సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), రామ్ నితిన్ (Ram Nitin) కాంబోలో రెండొ ప్రయత్నంగా రూపొందిన చిత్రం మ్యాడ్ స్వ్కైర్ (MAD Square). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara entertainments) ఈ మూవీని నిర్మిస్తుండగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తెలుగమ్మాయిలు ప్రియాంక జువాల్కర్ (Priyanka Jawalkar), రమ్య పసుపులేటి కథానాయికలుగా నటిస్తున్నారు. బీమ్స్ సిసిరిలియో (Bheems Ceciroleo) సంగీతం అందిస్తున్నాడు. మార్చి28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌ను చూస్తే మూవీ ఆరంభం నుంచి చివరి వరకు ఫుల్ ఫన్ రైడ్ అని స్పష్టంగా అర్థమవుతోంది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!