Narsapur | నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందే: మంత్రి హరీశ్‌రావు ఇంటిముందు బైటాయింపు

Narsapur | విధాత, మెదక్ బ్యూరో: నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ సిటింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కి ఇవ్వాలని మంత్రి హరీష్ రావు నివాసం ఎదుట ఆపార్టీ శ్రేణులు గురువారం నిరసనకు దిగాయి. నర్సాపూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అక్కడే బైఠాయించారు. మదన్ రెడ్డి కే టికెట్ కేటాయించాలని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు డిమాండ్ చేశారు. నియోజక వర్గంలో పార్టీని ఉద్యమ కాలం నుండి ఏకతాటిపై నడుపిస్తున్న ఎమ్మెల్యే మదన్ రెడ్డిని […]

Narsapur | నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వాల్సిందే: మంత్రి హరీశ్‌రావు ఇంటిముందు బైటాయింపు

Narsapur |

విధాత, మెదక్ బ్యూరో: నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ సిటింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కి ఇవ్వాలని మంత్రి హరీష్ రావు నివాసం ఎదుట ఆపార్టీ శ్రేణులు గురువారం నిరసనకు దిగాయి. నర్సాపూర్ నియోజక వర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అక్కడే బైఠాయించారు. మదన్ రెడ్డి కే టికెట్ కేటాయించాలని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు డిమాండ్ చేశారు.

నియోజక వర్గంలో పార్టీని ఉద్యమ కాలం నుండి ఏకతాటిపై నడుపిస్తున్న ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కాదని, ఎవరికి టికెట్ ఇచ్చినా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని తేల్చి చెప్పారు. పిలిస్తే పలికే నాయకుణ్ణి వదిలి మరో వ్యక్తికి టికెట్ కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి

ముఖ్య నాయకుల అభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. దాదాపు 3 గంటలపాటు కొనసాగిన ఆందోళన తరువాత హరీష్ ఇంటి బయటకు వచ్చి నాయకులకు హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో టికెట్ మదన్ రెడ్డి కి ఇవ్వకుంటే తదుపరి కార్యాచరణ చేపడుతామని హెచ్చరించారు. అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు నిరసనలో పాల్గొన్నారు.