Khammam | నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వే అడ్డగింత.. రఘునాథపాలెంలో ఉద్రిక్తత

Khammam | విధాత: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం (Raghunadhapalem) లో రైతుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వే పనులను అడ్డగించిన రైతులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం నెలకొనగా పోలీసులు రైతులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. ఈ క్రమంలో ఓ రైతు (Farmar) పురుగుల మందు తాగేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు సకాలంలో స్పందించి రైతు వద్ద నుండి పురుగుల మందు డబ్బాను లాగిపారేసి అతడిని అదుపులోకి […]

  • Publish Date - August 12, 2023 / 01:00 AM IST

Khammam | విధాత: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం (Raghunadhapalem) లో రైతుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వే పనులను అడ్డగించిన రైతులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం నెలకొనగా పోలీసులు రైతులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు.

ఈ క్రమంలో ఓ రైతు (Farmar) పురుగుల మందు తాగేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు సకాలంలో స్పందించి రైతు వద్ద నుండి పురుగుల మందు డబ్బాను లాగిపారేసి అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

రోడ్డు నిర్మాణ పనుల కోసం చేస్తున్న సర్వే (Survey) ఆపాలని రైతుల ఆందోళనతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎకరం నాలుగైదు కోట్లు పలుకుతున్న విలువైన సాగు భూములను కేవలం ఇరవై అయిదు లక్షలు ఇచ్చి స్వాధీనం చేసుకోనుండటంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రైతులు వాపోయారు.