పొత్తు పొడిచింది.. సీట్ల లెక్క ఎలా మరి!
ఉన్నమాట: విశాఖ ఎపిసోడ్ తో ఉవ్వెత్తున ఎగిసిన పవన్ ఇమేజిని క్యాష్ చేసుకునేందుకు రెడీగా ఉన్న చంద్రబాబు ఆ అవకాశాన్ని ఇట్టే క్యాచ్ చేశారు. విశాఖ నుంచి పవన్ విజయవాడ చేరగానే చంద్రబాబు వచ్చి వాలిపోయారు. దగ్గరకు తీసుకొని మద్దతు ప్రకటించారు. వాస్తవానికి పవన్ విశాఖ టూర్ అంతా తెరవెనుక చంద్రబాబు నడిపించారని అంటారు. ఏదైతేనేం ఈ విధంగా ఇద్దరూ మళ్ళీ కలిసి మాట్లాడుకోవడం.. రానున్న ఎన్నికల్లో కలిసి వెళ్లాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అంతవరకూ ఒకే […]

ఉన్నమాట: విశాఖ ఎపిసోడ్ తో ఉవ్వెత్తున ఎగిసిన పవన్ ఇమేజిని క్యాష్ చేసుకునేందుకు రెడీగా ఉన్న చంద్రబాబు ఆ అవకాశాన్ని ఇట్టే క్యాచ్ చేశారు. విశాఖ నుంచి పవన్ విజయవాడ చేరగానే చంద్రబాబు వచ్చి వాలిపోయారు. దగ్గరకు తీసుకొని మద్దతు ప్రకటించారు. వాస్తవానికి పవన్ విశాఖ టూర్ అంతా తెరవెనుక చంద్రబాబు నడిపించారని అంటారు.
ఏదైతేనేం ఈ విధంగా ఇద్దరూ మళ్ళీ కలిసి మాట్లాడుకోవడం.. రానున్న ఎన్నికల్లో కలిసి వెళ్లాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అంతవరకూ ఒకే కానీ సీట్ల లెక్క ఎలా ? పవన్ ఎన్ని సీట్లు అడుగుతారు.. చంద్రబాబు ఎన్ని ఇస్తారు… అసంతృప్తులను సర్దుబాటు చేయడం ఎలా…
వాస్తవానికి ఎన్నికల్లో..
సొంతంగా పోటీ చేసేంత మెకానిజం పవన్ కల్యాణ్ కు లేదు. సొంతంగా పోటీ చేసి గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇలా పరస్పరం వీరు మొదటి నుంచి అవగాహనతోనే ఉన్నారని అందరికీ తెలిసిందే. చంద్రబాబుతో సహవాసం విషయంలో తనెంతగా అభాసుపాలవుతున్నా పవన్ కల్యాణ్ కు మాత్రం మరో మార్గం లేదు.దీంతో తప్పనిసరిగా పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో పవన్ ఏకంగా 40 ఎమ్మెల్యే సీట్లు, ఐదు వరకూ ఎంపీ సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్ని సీట్లు చంద్రబాబు ఇస్తారా.. లేదా..ఓ పాతిక అసెంబ్లీ సీట్లు..రెండో మూడో లోక్ సభ సీట్లు ఇస్తారా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఒకేసారి 40 సీట్లలో లేదా పాతిక సీట్లలో జనసేనకు అవకాశం ఇచ్చేస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీలో పెద్ద కుదుపు
తప్పదు.. పార్టీలో అసంతృప్తులు ఎలా ఉంటాయో చంద్రబాబు ముందే ఉహించగలరు
తెలుగుదేశం పార్టీని నమ్ముకుని చాలా మంది మాజీ ఎమ్మెల్యేలున్నారు. అది కూడా జనసేనకు ఉన్న అడ్వాంటేజీ ప్రధానంగా గోదావరి జిల్లాల్లో. పవన్ ఇచ్చే జాబితాలో ఆ జిల్లాల్లోని నియోజకవర్గాలే ప్రధానంగా ఉంటాయి
సహజంగా. ఆ రెండు జిల్లాల మినహా పవన్ కల్యాణ్ పార్టీప్రభావం చూపే నియోజకవర్గాలు తక్కువే. చూడాలి ఇది ఎక్కడ బేరం తెగుతుందో త్వరలో స్పష్టత వస్తుంది.
ఇదిలా ఉండగా పవన్ ను హుటాహుటిన ఢిల్లీ రమ్మని బిజెపి కబురంపింది అంటున్నారు.ఎందుకు రమ్మన్నారు..పార్టీ పెద్దలు పవన్ తో బిజెపి పెద్దలు ఏం మాట్లాడతారు తెలియాల్సి ఉంది