Madhapur Drug Case | మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు

Madhapur Drug Case | విధాత, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో రోజురోజుకూ కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. గోవా, బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి, హైదరాబాద్ లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇదివరకే ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో సినీ ఫైనాన్సియర్ వెంకట్ డ్రగ్స్ సరఫరాలో కీలక సూత్రధారిగా పేర్కొంటున్నారు. ఇతని అక్రమాలపై నార్కోటిక్ పోలీసులు ఆరా తీశారు. తెలుగు రాష్ట్రాల్లో 25 కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. […]

  • Publish Date - September 1, 2023 / 10:08 AM IST

Madhapur Drug Case | విధాత, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసులో రోజురోజుకూ కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. గోవా, బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి, హైదరాబాద్ లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇదివరకే ఐదుగురిని అరెస్టు చేశారు. వీరిలో సినీ ఫైనాన్సియర్ వెంకట్ డ్రగ్స్ సరఫరాలో కీలక సూత్రధారిగా పేర్కొంటున్నారు. ఇతని అక్రమాలపై నార్కోటిక్ పోలీసులు ఆరా తీశారు.

తెలుగు రాష్ట్రాల్లో 25 కు పైగా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఐఆర్ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలకు పాల్పడినట్లు సమాచారం. సినీ నిర్మాతలు సీ కల్యాణ్‌, రమేష్‌ల నుంచి ఐఆర్‌ఎస్‌ అధికారినంటూ వసూళ్లకు పాల్పడ్డాడు. వారితో రూ.30 లక్షలకుపైగా కొట్టేశాడు. ఒక ఐఆర్‌ఎస్‌ అధికారిని సైతం పెళ్లి పేరుతో మోసం చేశాడని తెలిసింది.

సినిమాలో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల వేయడం, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం, పెళ్లి పేరుతో ఎన్‌ఆర్‌ఐ నంటూ విదేశీ యువతలను మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి వసూళ్లు, దందాలకు తెగబడుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్న వెంకట్.. సినీ, రాజకీయ నాయకులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టిస్తున్నాడు. ఆయన కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.