విధాత: ఎన్నికలకు సమాయత్తమవుతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఓటర్లను తనవైపు తిప్పుకోవడానికి ఇంకో కొత్త ఆలోచన చేస్తున్నారు. ప్రచారాన్ని ఉధృతం చేయడం.. ఓటర్లను మానసికంగా తమకు ఎటాచ్ చేసుకోవడం ఈ కొత్త కాన్సెప్ట్ ఉద్దేశ్యం అంటున్నరు.
ప్రజలకు తామే లబ్ధి చేకూరుస్తున్నామని గతంలో ఎప్పుడూ.. ఏ ప్రభుత్వం కూడా ఇంత లాభం చేకూర్చ లేదని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం వలంటీర్లతో ఇప్పటికే ప్రతి రోజూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది. ఇక ఇప్పుడు ఈ నెల 11 నుంచి ఈ స్టిక్కర్ కాన్సెప్ట్ అమలు చేయనుంది.
ఇందులో భాగంగా పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి ఇంటి గోడ మీదా. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అని రాసి ఉన్న స్టిక్కర్ను అంటించనున్నారు. దీంతో డైలీ ఆ పొష్టర్ చూసిన ఇంటి వాళ్ళంతా ఆటోమాటిక్‌గా జగన్ పార్టీకి కనెక్ట్ అవుతారన్నది ఈ కాన్సెప్ట్ ఉద్దేశ్యం.
ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వలంటీర్‌తో బాటు ఇద్దరు గ్రామ సారథులను నియమించిన జగన్ ఓటర్లను తమ ఫోల్డర్లోంచి బయటకు పోకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే.. లబ్ధిదారుల అనుమతి మేరకే ఈ స్టిక్కర్లను అంటిస్తామని ప్రభుత్వం తెలిపింది.
కానీ ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక పథకం లబ్ధిదారుడు ఉంటాడు కాబట్టి ప్రతి ఇంటికి స్టిక్కర్ తప్పదని, వీటిని అంటించే బాధ్యత వలంటీర్లు, గ్రామ సారథులు తీసుకుంటారని అంటున్నారు. గతంలో స్కూళ్లకు వైఎస్సార్సీపీ రంగులైన ఆకుపచ్చ, నీలం రంగులు వేసినందుకు కోర్టు ఆక్షేపణ తెలిపింది. ఇప్పుడు ఇలా ఇంటింటికి స్టిక్కర్ వేస్తే ప్రతిపక్ష పార్టీ ఊరుకుంటుందా.. ఎలాంటి చర్యలతో దీన్ని అడ్డుకుంటుందో చూడాలి.