బిగ్ బాస్ హౌజ్‌లోకి కొత్త కంటెస్టెంట్స్… ర‌చ్చ చేసిన ర‌వితేజ‌, సిద్దార్థ్

  • By: sn    latest    Oct 09, 2023 3:01 AM IST
బిగ్ బాస్ హౌజ్‌లోకి కొత్త కంటెస్టెంట్స్… ర‌చ్చ చేసిన ర‌వితేజ‌, సిద్దార్థ్

బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా అని చెబుతూ షోపై ఆస‌క్తి క‌న‌బ‌ర‌చిన మేక‌ర్స్ అందుకు త‌గ్గ‌ట్టు ఇంట్రెస్టింగ్‌గా గేమ్‌ని న‌డిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ముందుగా బిగ్ బాస్ సీజ‌న్ 7లోకి 14 మందిని ప్ర‌వేశపెట్ట‌గా, ఇప్పటికే హౌస్ నుంచి ఐదుగురు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. గౌత‌మ్‌ని సీక్రెట్ రూంలో ఉంచారు. ఆదివారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ సీజన్ 7 2.ఓ అంటూ బిగ్ బాస్ రీ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వ‌హించ‌గా, కొంత మంది హౌజ్‌మేట్స్‌ని బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపారు. ఈ ఈవెంట్‌కి ర‌వితేజ అండ్ టీంతో పాటు సిద్ధార్థ్ హాజ‌రై త‌మ సినిమా ప్ర‌మోష‌న్స్ జ‌రుపుకున్నారు.

ఇక రీలాంచ్ ఈవెంట్‌లో నటుడు అంబటి అర్జున్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి అద‌ర‌గొట్టాడు. హౌజ్‌లో ఉన్న‌వారికి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఏర్ప‌డుతుంది. మ‌ధ్య‌లో వ‌చ్చిన మాకు కాస్త ఇబ్బందే ఉంటుంది. మరి నీకు పోటీ ఎవరనుకుంటున్నావ్ అంటే. శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ నాకు పోటీ అనుకోవడం లేదు, కానీ వాళ్లతో పోటీ పడాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు అర్జున్. ఇక అనంత‌రం బిగ్ బాస్ హౌస్ లోకి న‌టి అశ్విని ఎంట్రీ ఇచ్చింది. ఆకట్టుకునే డాన్స్ పర్ఫామెన్స్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు కాసేపు నాగ్‌తో క‌లిసి సంద‌డి చేసింది. శివాజీ, ప్రశాంత్ ద‌మ్ముగా ఆడుతున్నార‌ని.. దుమ్ము దుమ్ముగా ప్రియాంక, శోభా శెట్టి ఆడుతున్నారని అశ్విని చెప్పుకొచ్చింది.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ భోలే షావలి తదుప‌రి కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. ఫోక్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన భోలే షావలి.. తనను తాను పాట బిడ్డగా పరిచయం చేసుకుంటూ నాగార్జున గురించి అద్భుతంగా ఓ సాంగ్ ఆల‌పించాడు. కొంచెం నువ్వు మాట్లాడ‌డం త‌గ్గించుకుంటే మంచిది అని నాగార్జున అతనికి స‌ల‌హా ఇచ్చాడు. ఆ త‌ర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి పూజా మూర్తి ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందే బిగ్ బాస్ కు వెళ్లాల్సి ఉండగా తన తండ్రి చనిపోవ‌డంతో రాలేక‌పోయాన‌ని పేర్కొంది. ఆమెకి తన తండ్రికి ఎక్కువగా ఇష్టమైన పుదీనా చికెన్ ను ఇచ్చి నాగార్జున స‌ర్‌ప్రైజ్ చేశాడు. చివ‌రి కంటెస్టెంట్‌గా యూట్యూబర్ నయని పావని ఎంట్రీ ఇచ్చింది . అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ హౌజ్‌లొకి వెళ్లి కూడా సంద‌డి చేసింది. ఈ అమ్మ‌డికి యావర్, తేజ, ప్రశాంత్ ఫొటోస్ చూపించగా.. యావర్ ను డేట్ చేస్తా.. తేజ ప్రెండ్, ప్రశాంత్ ను పెళ్లి చేసుకుంటా స‌ర్‌ప్రైజింగ్ స‌మాధానాలు ఇచ్చింది. ఇక బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కి చాలా లక్షల విలువైన డైమెండ్ సెట్ ఇవ్వనున్నార‌ని నాగార్జున తెలియ‌జేశారు.