IMPS Rules | బ్యాంక్‌ ఖాతాదారులకు అలర్ట్‌..! ఐఎంపీఎస్‌ రూల్స్‌ మారాయ్‌

మీకు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయా..? నగదును ఇతరులకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంటారా..? అయితే వార్త మీ కోసమే..!

IMPS Rules | బ్యాంక్‌ ఖాతాదారులకు అలర్ట్‌..! ఐఎంపీఎస్‌ రూల్స్‌ మారాయ్‌

IMPS Rules | మీకు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయా..? నగదును ఇతరులకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంటారా..? అయితే వార్త మీ కోసమే..! ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఐఎంపీఎస్‌ (Immediate Payment Service) నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ఇకపై ఏ వ్యక్తి పేరును జోడించకుండానే రూ.5లక్షల వరకు నగదును బదిలీ చేసేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్ ఇండియా (NPCI) అవకాశం కల్పించింది.


ఇందుకు గతేడాది అక్టోబర్‌ 31న సర్క్యూలర్‌ను జారీ చేసింది. నిబంధనల మార్పు నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఖాతా నంబర్లు, ఐఎఫ్‌సీఐ కోడ్‌ తదితర వివరాలు ఎంటర్‌ చేయకుండానే రూ.5 లక్షల వరకు అమౌంట్‌ను బదిలీ చేయడానికి వినియోగదారులకు అనుమతిచ్చేలా కొత్త నిబంధనను తీసుకువచ్చింది.


ఐఎంపీఎస్‌ నిబంధనల ప్రకారం.. వినియోగదారులు కేవలం మొబైల్ నంబర్, బ్యాంక్ పేరును ఉపయోగించి లావాదేవీని చేసుకోవచ్చు. ఇది ప్రక్రియను క్రమబద్ధీకరించడంతో పాటు త్వరితగతిన పని పూర్తి చేస్తుంది. ఐఎంపీఎస్‌ (Immediate Payment Service) సేవలతో దాని 24గంటలూ తక్షణం నగదు బదిలీ చేసుకునేందుకు వీలుంటుంది. భారత్‌లో నగదు ట్రాన్స్‌ఫర్‌లో ఐఎంపీఎస్‌ కీలక పాత్ర పోషిస్తున్నది.


ఐఎంపీఎస్‌ డబ్బులు ఎలా పంపాలంటే..


మొదట మొబైల్‌ బ్యాంక్‌ యాప్‌ ఓపెన్‌ చేయండి. ఆ తర్వాత ఫండ్ ట్రాన్స్‌ఫర్‌పై క్లిక్‌ చేయాలి. ఇందులో ఐఎంపీఎస్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే డబ్బులు పంపించాలనుకుంటున్నారో వారి మొబైల్‌ నంబర్‌, బ్యాంక్‌ పేరును ఎంటర్‌ చేయాలి. ఇక్కడ అకౌంట్‌ నంబర్‌, ఐఎఫ్‌సీ కోడ్‌ను ఇకపై ఎంటర్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఎంత మొత్తం వరకు నగదును పంపాలనుకుంటున్నారో నగదు విలువను ఎంటర్‌ చేయాలి.


అయితే, రూ.5లక్షల వరకు మాత్రమే పంపించవచ్చని గుర్తు పెట్టుకోండి. అమౌంట్‌ను ఎంటర్‌ చేసిన తర్వాత నిర్ధారించు ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేసిన తర్వాత సబ్మిట్‌ చేయాలి. అంతే ఇక ట్రాన్సాక్షన్‌ పూర్తవుతుంది. ఎవరికైతే డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేశారో వారి ఖాతాలో క్షణంలోనే చేరిపోతాయి.