ఉద్ధవ్ వర్గానికి “శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే” పేరు ఖరారు
మహారాష్ట్రలో పార్టీ గుర్తుపై ఉద్ధవ్‌ఠాక్రే, ఏక్నాథ్ శిండే వర్గాల మధ్య కొంతకాలంగా పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన వర్గానికి "శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే" పార్టీ పేరు ఖరారు చేసింది. దీంతో పాటు అంధేరీ తూర్పు ఉప ఎన్నికలో "కాగడా" గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. శిండే వర్గపు పార్టీ పేరు "బాలాసాహెబ్ బంచీ శివసేన"గా ఈసీ గుర్తించింది. పార్టీ విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతుండటంతో […]

మహారాష్ట్రలో పార్టీ గుర్తుపై ఉద్ధవ్‌ఠాక్రే, ఏక్నాథ్ శిండే వర్గాల మధ్య కొంతకాలంగా పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన వర్గానికి “శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే” పార్టీ పేరు ఖరారు చేసింది.
దీంతో పాటు అంధేరీ తూర్పు ఉప ఎన్నికలో “కాగడా” గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. శిండే వర్గపు పార్టీ పేరు “బాలాసాహెబ్ బంచీ శివసేన”గా ఈసీ గుర్తించింది. పార్టీ విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతుండటంతో పార్టీ గుర్తు విల్లు బాణం ఎవరూ వాడకుండా ఈసీ ఆదేశించింది.
3 కొత్త గుర్తులు సూచించాలని ఈసీ సూచించడంతో తమకు త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు, కాగడా గుర్తుల్లో ఒకటి కేటాయించాలని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం కోరింది. అందులో కాగడా గుర్తు కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్నది. శిండే వర్గానికి పార్టీ పేరు ఖరారు చేసినా, పార్టీ గుర్తుకోసం మరిన్ని ఆప్షన్స్ పంపించాలని సూచించింది.