Vote | అక్కడ.. 16 ఏండ్ల‌కే ఓటు హ‌క్కు

Vote | ప్ర‌పంచంలోని చాలా దేశాలు 18 ఏండ్లు నిండిన యువ‌తీయువ‌కులంద‌రికీ ఓటు హ‌క్కు క‌ల్పిస్తున్నాయి. అయితే న్యూజిలాండ్ ప్ర‌భుత్వం ఓటు హ‌క్కు విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఓటు హ‌క్కు వ‌య‌సును 18 నుంచి 16 ఏండ్ల‌కు త‌గ్గించాల‌ని న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్ భావిస్తున్నారు. 16 ఏండ్ల‌కే ఓటు హ‌క్కు క‌ల్పించ‌డం చ‌రిత్రాత్మ‌కం అని ఆ దేశం పేర్కొంది. అయితే న్యూజిలాండ్ సుప్రీంకోర్టు ఇటీవ‌ల ఇచ్చిన తీర్పు ఆధారంగా అక్క‌డి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం […]

  • Publish Date - November 22, 2022 / 07:57 AM IST

Vote | ప్ర‌పంచంలోని చాలా దేశాలు 18 ఏండ్లు నిండిన యువ‌తీయువ‌కులంద‌రికీ ఓటు హ‌క్కు క‌ల్పిస్తున్నాయి. అయితే న్యూజిలాండ్ ప్ర‌భుత్వం ఓటు హ‌క్కు విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఓటు హ‌క్కు వ‌య‌సును 18 నుంచి 16 ఏండ్ల‌కు త‌గ్గించాల‌ని న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్ భావిస్తున్నారు. 16 ఏండ్ల‌కే ఓటు హ‌క్కు క‌ల్పించ‌డం చ‌రిత్రాత్మ‌కం అని ఆ దేశం పేర్కొంది.

అయితే న్యూజిలాండ్ సుప్రీంకోర్టు ఇటీవ‌ల ఇచ్చిన తీర్పు ఆధారంగా అక్క‌డి ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. 18 ఏండ్లు నిండిన యువ‌తీయువ‌కుల‌నే ఓటు హ‌క్కు క‌ల్పించ‌డం అంటే యువ‌త మాన‌వ హ‌క్కుల్ని ఉల్లంఘించ‌డం అవుతుంద‌ని న్యూజిలాండ్ కోర్టు ఓ కేసులో తీర్పునిచ్చింది.

ఈ క్ర‌మంలో ఓటు హ‌క్కు వ‌య‌సును త‌గ్గించేందుకు ఆ దేశ ప్ర‌ధాని జెసిండా ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును పాస్ చేసేందుకు 75 శాతం మంది ఎంపీలు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. బ్రెజిల్, ఆస్ట్రియా, క్యూబా దేశాలు మాత్రం 18 ఏండ్ల క‌న్నా త‌క్కువ వ‌య‌సున్న వారికి ఓటు వేసే అవ‌కాశం క‌ల్పిస్తోంది.