America | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్న భారత సంతతి అమెరికన్ నిక్కి హేలికి షాక్ తగిలింది. రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ఎన్నికల్లో మరోసారి ఆమెకు నిరాశ తప్పలేదు. న్యూ హాంప్‌షైర్ ప్రైమరీ (GOP Primary)లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ నిక్కి హేలి కంటే ముందువరుసలో కొనసాగుతున్నారు.
ఈ ఫలితం నిక్కి హేలికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. మొత్తం ఓట్లలో 26శాతం వరకు లెక్కించిన ఓట్లలో 53.8శాతం ఓట్లు ట్రంప్‌కే పోలయ్యాయి. నిక్కి హేలికి 45.5శాతం మాత్రమే వచ్చాయి. సీఎన్‌ఎన్ ప్రకారం 15శాతం ఓట్ల లెక్కింపు తర్వాత ట్రంప్ 53.1శాతం ఓట్లు వచ్చాయి. 11 మంది ప్రతినిధుల్లో ట్రంప్ సైతం హేలి కంటే ముందున్నారు. హేలీకి కేవలం 45.4 శాతం రాగా.. ట్రంప్ గెలుపుపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉన్నది.
నిక్కీ హేలికి భారీ షాక్ ఎందుకు..
న్యూయార్క్ టైమ్స్ కూడా ట్రంప్ 52.5 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నట్లు పేర్కొంది. ప్రైమరీలో సగానికి పైగా ఓట్లతో పాటు 11 మంది డెలిగేట్ల ఆధిక్యంతో ట్రంప్ విజయం సాధించారు. హేలీకి 46.6 శాతం ఓట్లు, ఆరుగురు డెలిగేట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ ట్రంప్ విజయం హేలిని మరింత ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఆమె ఎక్కువ సమయంలో ఈ రాష్ట్రంలోనే గడిపారు. ప్రముఖ గవర్నర్ క్రిస్ సునునూ సైతం హేలికి మద్దతు తెలిపారు. తుది ఫలితాలు వెలువడే సరికి ఫలితాలు ఆయనకు అనుకూలంగా రాలేదు. ఓ సందర్భంలో మాత్రమే హేలి, ట్రంప్ మధ్య గట్టి పోటీ కనిపించింది.
నిక్కి హేలిని ఉపాధ్యక్షురాలిగా చేయడానికి గతంలో ట్రంప్ నిరాకరించారు. దాంతో న్యూ హాంప్‌షైర్ ఫలితాలు షాక్‌లాంటివే. ఐక్యరాజ్యసమితి వంటి అత్యున్నత వేదికపై అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన నిక్కి హేలిని ఉపాధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని ట్రంప్ పూర్తిగా తిరస్కరించారు. సెనేటర్‌గా నిక్కీ హేలి బాగానే ఉందని, అయితే ఆమెను ఉపాధ్యక్ష పదవికి తన రన్నింగ్ మేట్ అభ్యర్థిగా పరిగణించలేమని ఆయన చెప్పారు. అమెరికా ఎన్నికల పరిభాషలో వైస్ ప్రెసిడెంట్ పదవికి అభ్యర్థిని రన్నింగ్ మేట్‌గా పిలుస్తారు.