NIMS | బెడిసి కొట్టిన.. నిమ్స్ డాక్టర్ల సహజీవనం! పొలీసులకు ఫిర్యాదు

NIMS | సహజీవనం చేసి మోసపోయా.. విధాత: ఇద్దరు డాక్టర్ల ప్రేమాయణం బెడిసి కొట్టింది. సహజీవనంతో ముగిసి, పోలీస్ స్టేషన్‌కు చేరింది. వైద్యురాలు ప్రేమ పేరిట మరో డాక్టర్‌తో సహజీవనం చేసి మోసపోయింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కేరళకు చెందిన ఓ వైద్యురాలు (34) హైదరాబాద్ నిమ్స్ లోని క్లినికల్ విభాగంలో సీనియర్ రెసిడెంట్ గా చేరారు. అదే ఆస్పత్రిలోని గ్యాస్ట్రో సర్జరీ విభాగం డాక్టర్ సౌరవ్ చౌదరితో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2020లో ఇద్దరు […]

NIMS | బెడిసి కొట్టిన.. నిమ్స్ డాక్టర్ల సహజీవనం! పొలీసులకు ఫిర్యాదు

NIMS |

  • సహజీవనం చేసి మోసపోయా..

విధాత: ఇద్దరు డాక్టర్ల ప్రేమాయణం బెడిసి కొట్టింది. సహజీవనంతో ముగిసి, పోలీస్ స్టేషన్‌కు చేరింది. వైద్యురాలు ప్రేమ పేరిట మరో డాక్టర్‌తో సహజీవనం చేసి మోసపోయింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కేరళకు చెందిన ఓ వైద్యురాలు (34) హైదరాబాద్ నిమ్స్ లోని క్లినికల్ విభాగంలో సీనియర్ రెసిడెంట్ గా చేరారు.

అదే ఆస్పత్రిలోని గ్యాస్ట్రో సర్జరీ విభాగం డాక్టర్ సౌరవ్ చౌదరితో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2020లో ఇద్దరు నిమ్స్ హాస్టల్లో ఉన్నారు. ఈక్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది.

పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సౌరవ్ సహ జీవనం చేశాడు. ఆ తర్వాత కోల్‌కతా వెళ్లిపోయాడు. మోస పోయానని గ్రహించిన ఆమె, గురువారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది